గత వారం 'విష్ణు విన్యాసం'తో నవ్వులు పూయించిన టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు గ్యాప్ లేకుండా మరో కొత్త సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మృత్యుంజయ్. రెబా మోనికా జాన్ కథానాయికగా నటించగా.. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం. శ్రీవిష్ణు ఒక న్యూస్ రిపోర్టర్. కైమ్ బ్యూరోలో పనిచేయాలనేది తన కల, కానీ అవకాశం దొరకక ప్రస్తుతానికి అడ్వర్టైజ్మెంట్ విభాగంలో పనిచేస్తుంటాడు. ఎవరైనా మరణిస్తే, వారి ఇంటికి వెళ్లి ఆ వ్యక్తి గొప్పతనం గురించి రాసి, కుటుంబ సభ్యుల నుండి శ్రద్ధాంజలి ప్రకటనలు సేకరించడం అతడి వృత్తి. ఈ క్రమంలో అచ్యుత్ రావు (బాలాదిత్య) మరణం జయ్‌ను కదిలిస్తుంది. అచ్యుత్ కూతురు అంజలి తన తండ్రి మరణం వెనుక ఉన్న కారణాన్ని అడగడంతో, జయ్ ఆ బాధ్యతను భుజానికెత్తుకుంటాడు. వరుసగా జరుగుతున్న కొన్ని మరణాలు ప్రమాదాలు కావని, పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న హత్యలని జయ్ గుర్తిస్తాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఐపీఎస్ అధికారి సీత (రెబా మోనికా జాన్) తో కలిసి జయ్ ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఆ కిల్లర్ అసలు లక్ష్యం ఏమిటి? అన్నదే మిగతా కథ. ర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఒక విభిన్నమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు. కేవలం హత్యలు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా, హీరో-విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాకు ప్రధాన బలమై నిలిచింది. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, హీరో చేసే వింతైన ఉద్యోగం ఆసక్తికరంగా ఉంటాయి. అయితే కథ అసలు పాయింటికి రావడానికి కొంత సమయం తీసుకుంటుంది. ద్వితియార్ధంలో సినిమా వేగం పెరుగుతుంది. హీరో-విలన్ ఒకరికొకరు తెలియకుండానే ఎదురుపడే సన్నివేశాలు, ఒకరి ఎత్తులకు మరొకరు పై?త్తులు వేయడం ఉత్కంఠను కలిగిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. శ్రీవిష్ణు తన మార్కు కామెడీని పక్కన పెట్టి, చాలా సీరియస్ రోల్లో ఒదిగిపోయాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పాత్రకు తగ్గట్లుగా ఉన్నాయి. రెబా మోనికా జాన్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. వీర్ ఆర్యన్ ప్రతినాయకుడిగా వీర్ ఆర్యన్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్‌లో తన నటనతో భయపెట్టారు.