భారత వికెట్ కీపర్, తెలుగు తేజం కోన శ్రీకర్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా గురువారం వెల్లడించాడు. గమనమందరం కలిసి పంచుకున్న క్షణాలు, సాధించిన విజయాలు నా కెరీర్ లో ఎంతో సహాయపడ్డాయి. మీరందరూ లేకపోతే నా కలను నిజం చేసుకోవడం, ఇన్నేళ్లపాటు ఈ ఆటను ఆడటం నాకు సాధ్యమయ్యేది కాదు. నా ప్రతిభను నిరూపించుకోవడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి నాకు అవకాశం కల్పించిన నా ఐపీఎల్ అరంగేట్ర కెప్టెన్ విరాట్ కోహ్లి, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ, నా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సార్‌కి ధన్యవాదాలు. భారత్-ఏ జట్టు నుంచి టీమిండియా వరకు ఆయన అందించిన గైడెన్స్ ఎప్పటికీ మరవలేనిది. మీ మద్దతుతోనే నేను భారత టెస్ట్ క్రికెటర్‌ను కాగలిగాను. యువ ఆటగాళ్లకు నా సలహా ఏంటంటే.. పెద్ద కలలు కనండి. వాటిని సాధించడానికి నిరంతరం కష్టపడండి. పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, దృఢ సంకల్పం ఉంటే కలలు ఖచ్చితంగా సాకరమవుతాయి. బీసీసీఐ, టెస్ట్ క్రికెట్‌తో నా ప్రయాణం ముగిసి ఉండవచ్చు. కానీ ఈ ఆటతో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాణించాలని కలలు కనే తదుపరి తరానికి మార్గదర్శకత్వం. మెంటారింగ్, కోచింగ్ ఇవ్వడం ద్వారా నా వంతుగా క్రికెట్‌కు సేవ చేస్తూనే ఉంటాను.' అని కేఎస్ భరత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగు చెందిన 32 ఏళ్ల భరత్ తన కెరీర్లో 7 టెస్టులు, 10 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైటైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే వికెట్ కీపర్-బ్యాటర్ ట్రిపుల్ సెంచరీ (308 పరుగులు) చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. 2014-15 సీజన్లో గోవాపై ఈ రికార్డు స్కోరు నమోదు చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించడం అతని కెరీర్‌కి హైలైట్. 113 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కేఎస్ భరత్.. 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలతో పాటు 34 హాఫ్ 380 క్యాచ్‌లు అందుకోవడంతో సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా పాటు 42 స్టంపౌట్స్ చేశాడు.ర్వంతో, కృతజఙ్ఞతా భావంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దేశం కోసం ఆడటం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపాడు. 'ఎంతో గర్వంతో, కృతజ్ఞతాభావంతో నేను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. దేశం తరఫున ఆడటం జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో ఎంతో పట్టుదల, బలం అవసరమయ్యాయి. కానీ టెస్ట్ క్రికెట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్‌కు అండగా నిలిచిన బీసీసీఐ, కోచ్‌లు, మేనేజర్లందరికీ నా ధన్యవాదాలు. అత్యున్నత స్థాయిలో ఆడటానికి గొప్ప వాతావరణాన్ని సృష్టించి, నాకు నిరంతరం మద్దతుగా నిలిచినందుకు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నా సహచర ఆటగాళ్లందరికీ బిగ్ థ్యాంక్స్.