దర్శకుడు బోయపాటి శ్రీను, వెంకటేష్‌తో కలిసి కొత్త సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తులసి' సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత బోయపాటితో సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను తన కెరీర్లో భారీ విజయాన్ని సాధించి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.