రుక్మిణీ వసంత్ సాత్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోన్న పేరు ఇది. -కాంతార చాప్టర్ వన్- లో కనకవతి పాత్రతో అమ్మడు ఊహించని రేంజ్ లో కనెక్ట్ అయింది. అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. అంతేనా వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు కమిట్ అవుతూ అంతకంతకు సంచలనం అవుతోంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తోన్న -టాక్సిక్- లో అమ్మడు కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం - డ్రాగన్- లోనూ ఛాన్స్ అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్నఈ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లు అందుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలకు అమ్మడు పర్పెక్ట్ ఛాయిస్ గా నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండా ఓరేంజ్ లో పాపులారిటీ సంపాదించింది. స్ట్రెయిట్ చిత్రంతో హిట్ అందుకుంటే రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ఊపులో రుక్మిణీ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా -కిల్- ఫేం నిఖిల్ నగేష్ ఓ చిత్రం తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో కార్తీక్ కి జోడీగా రుక్మిణీ వసంత్ ను తీసు కుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతుంది. టి సిరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వాస్తవానికి ఇదే చిత్రంలో హీరోయిన్ గా అలియాభట్ ను తీసుకోవాలనుకున్నారు. ఆమె తో డిస్కషన్ కూడా జరిగింది. కానీ అలియా బిజీ షెడ్యూల్ కారణంగా నో చెప్పింది. దీంతో బాలీవుడ్ హీరోయిన్లు అందర్నీ పక్కన బెట్టి సాత్ భామ వైపు చూసారు. అలా రుక్మిణికి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేనే ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ దశలో ఉండగానే - ప్రళయ్- ఓ జోంబీ చిత్రంలోనూ ఛాన్స్ అందుకుందనే వార్త వైరల్ గా మారింది. రణ వీర్ సింగ్ కథానాయకుడిగా జై మెహతా దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇందులోనూ హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ అయితే బాగుంటుందని భావిస్తున్నారుట. ఈ ఛాన్స్లనుక రుక్మిణీ అందుకోగలిగితే అమ్మడి కెరీర్ కు మరో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోల్లో రణవీర్ సింగ్ టాప్ లో కొనసాగుతున్నాడు. -ధురంధర్ విజయంతో అతడి రేంజ్ రెట్టింపు అయిన క్రమంలో అతడితో నటిం చడానికి ఎంతో మంది బాలీవుడ్ భామలు పోటీ వడుతున్నారు. ఇందులో సీనియర్ భామలు కూడా ఉన్నారు. వారెవరికీ రాని గొప్ప అవకాశం రుక్మిణీ వసంత్ కి వస్తున్నట్లే.