సినీప్రియులందరి దృష్టి ప్రస్తుతం 'రామాయణ' మీదే ఉంది. బాలీవుడ్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రబ్బీర్ కపూర్.. రాముడి పాత్రలో, సీతగా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. విలక్షణ నటుడు యశ్.. రావణుడిగా కనిపించనున్నారు. ఆయన సతీమణి మండోదరి పాత్రలో కాజల్ నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఓ అవార్డు వేడుకకు హాజరైన కాజల్ ఈ సినిమా గురించి మాట్లాడారు. తన కెరీర్లోనే ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ చేయడం మొదటిసారి అని అన్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. భారీ స్థాయిలో 'రామాయణ' రానుంది. గతంతో నితేశ్ తివారీఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. 5వేల సంవత్సరాలకు పైగా కోట్లాది హృదయాలను పాలిస్తున్న ఈ ఇతిహాసాన్ని తెర పైకి తీసుకురావడానికి దశాబ్దం నుంచి అన్వేషణ ప్రారంభించాం. మా చిత్రబృందం ఈ చిత్రం కోసం విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూనే ఉంది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయబోతున్నాం' అని అన్నారు. ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం విడుదల కానుంది.