టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ సుదీర్ఘ విరామం తర్వాత జంటగా నటించిన చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూనని'. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్షేమ్ కామెడీ డ్రామాను శివాజీ స్వయంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. హార్షిలి హిల్స్‌లో నివసించే శ్రీరామ్ (శివాజీ) ఒక నిజాయితీ గల పంచాయతీ కార్యదర్శి. తన భార్య ఉత్తర (లయ), రీల్స్ పిచ్చితో వింత పనులు చేసే కొడుకు నితిన్ అలియాస్ బిట్టు (రోహన్) తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే, ఆడవాళ్ల పిచ్చి ఉ న్న స్థానిక ఎస్పై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్), శ్రీరామ్ లేని సమయంలో ఉత్తరపై కన్నేసి వారి ఇంటికి వస్తాడు. కానీ ఊహించని విధంగా శ్రీరామ్ కొడుకు చేతిలో ఆ ఎస్పై హత్యకు గురవుతాడు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ హత్య కేసు నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రీరామ్ ఏం చేశాడు? శవాన్ని మాయం చేసే క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? మరోవైపు కోటి రూపాయల గిఫ్ట్ బ్యాగ్ కోసం ఎమ్మెల్యే తిమ్మప్ప (శరత్ లోహితాశ్వ) గ్యాంగ్ శ్రీరామ్ వెంట ఎందుకు పడింది? ఈ గందరగోళంలో కానిస్టేబుల్ సుధీర్ (ధనరాజ్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఒక డార్క్ కైమ్ థ్రిల్లర్‌ను వినోదాత్మకంగా మలచడంలో సఫలమయ్యాడని చెప్పవచ్చు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినప్పటికీ, పాత్రల చిత్రణ మరియు కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమా ఆరంభంలో పాత్రల పరిచయం, ఆ తర్వాత వచ్చే మలుపులు ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తాయి. అయితే ఎప్పుడైతే హత్య జరుగుతుందో, అక్కడి నుండి కథ థ్రిల్లింగ్ మోడ్‌లోకి మారుతుంది. శవాన్ని మాయం చేసేందుకు హీరో వేసే ప్లాన్లు, మరోవైపు ఎమ్మెల్యే మనుషుల నుంచి తప్పించుకునే సీన్లు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే, ద్వితీయార్థంలో అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. శివాజీ తనదైన టైమింగ్ మరియు అనుభవంతో శ్రీరామ్ పాత్రలో ఒదిగిపోయారు. మధ్యతరగతి తండ్రి పడే తపనను చక్కగా పండించారు. చాలా కాలం తర్వాత తెరపై కనిపించినా, తన నటనతో అలరించింది లయ. ఇక కొడుకు పాత్రలో రోహన్ తన అల్లరితో నవ్వించగా, ధనరాజ్ పాత్ర చివరిలో సర్సైజ్ చేస్తుంది. శరత్ లోహితాశ్వ, ప్రిన్స్ తమ పరిధి మేరకు నటించారు.