భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన అవనిస్థాన్..
ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం!
భారత స్పినకు అఫ్గాన్ ఆటగాళ్లు కకావికలం
తొలి ఇన్నింగ్స్ 152 పరుగులకు ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ప్యాకప్
ఏడు వికెట్లతో సత్తాచాటిన మానవ్ సుతార్
నిప్పులు చెరిగిన కుల్దీప్, వాషింగ్టన్ సుందర్
ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో అఫ్ఘనిస్థాన్ జట్టు చిత్తు చిత్తుగా ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ అయిన అప్షన్.. రెండో ఇన్నింగ్స్ 112 పరుగులకే ముగించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 564/8 పరుగులు చేయడంతో.. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టుతో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఓవరాల్‌గా ఏడు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. భారత్ అఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.
మూడు రోజుల్లో ముగిసిన ఈ టెస్టులో టీమిండియా ఆధిపత్య ధోరణి ప్రదర్శించింది. ఆరంభం నుంచి ఏకపక్షంగా సాగిన ఈ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మన విజయం సాధించింది. డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ 2025 -27లో టీమిండియాకు ఈ విజయం చాలా సపోర్ట్ ఇవ్వనుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టులో మూడో రోజు అఫ్ఘనిస్థాన్ రెండుసార్లు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ 113/5తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన అఫ్ఘనిస్థాన్.. మొదటి సెషన్లోనే 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ప్రారంభించిన అఫ్ఘనిస్థాన్ లంచ్ బ్రేక్ కి ముందు ఎలాంటి వికెట్లు కోల్పోలేదు. లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి వికెట్ తీసుకోగా.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ అఫ్ఘనిస్థాన్ బ్యాటర్లను పెవిలియన్‌కు క్యూ కట్టించాడు. ఓపెనర్ సెడికుల్లా అటల్ క్రీజులో ఉన్నంత సేపు కొంచెం పోరాడిన అఫ్ఘనిస్థాన్ ఆ తర్వాత నుంచి కుప్పకూలింది. దాంతో మూడో రోజు ఆట మిగిలుండగానే అఫ్ఘనిస్థాన్ కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. అఫ్ఘనిస్థాన్ బ్యాటర్లలో సెడికుల్లా అటల్ 42, రహ్మానుల్లా గుర్భాజ్ 24, రహ్మత్ షా 13 పరుగులు చేయగా.. మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో సుందర్ 4, కుల్దీప్ 3, మానవ్ సుతార్ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 127 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. కేఎల్ రాహుల్ 100, శుభమన్ గిల్ 126, సాయి సుదర్శన్ 81, రిషబ్ పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేశాడు. ఈ టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన యువ స్పిన్నర్ మానవ్ నుతార్ తొలి ఇన్నింగ్స్ ఆరు, రెండో ఇన్నింగ్స్ ఒకటి ఓవరాల్‌గా ఏడు వికెట్లు వడగొట్టి రికార్డు సృష్టించాడు. 412 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్థాన్ 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సెడీఖుల్లా అటల్ (80 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్త్ 42), రెహ్మనుల్లా గుర్బాజ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్త్ 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వాషింగ్టన్ సుందర్(3/30), కుల్దీప్ యాదవ్(4/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. మానవ్ సుతార్‌కు ఒక వికెట్ దక్కింది. గాయంతో షరావుద్దిన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. 14 పరుగుల వ్యవధిలోనే అఫ్గాన్ చివరి 6 వికెట్లు కోల్పోవడం గమనా ర్హం. భారత బౌలర్లలో మానవ్ సుతార్(6/33) 6 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ప్రసిధ్ కృష్ణ(3/37) మూడు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్(1/21) ఒక వికెట్ దక్కింది. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. టెస్ట్ క్రికెట్ అనుభవలేమి అఫ్గాన్ కొంపముంచింది. అఫ్గాన్ మూడో రోజు రెండున్నర సెషన్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
టెస్టుల్లో అతిపెద్ద విజయం
టెస్ట్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచు ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో భారత గడ్డపై టెస్టుల్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 564/8 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది. అనంతరం తమకు అలవాటైన రీతిలో స్పిన్‌తో ప్రత్యర్థికి ఉచ్చు బిగించింది. తొలి ఇన్నింగ్స్ అఫ్ఘానిస్థాన్‌ను 152 పరుగులకు కుప్పకూల్చింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ మరింత చెలరేగిపోయిన భారత బౌలర్లు.. అఫ్ఘానిస్థాన్‌ను 112 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. సొంత గడ్డపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తాజా ఫలితంతో టెస్ట్‌ల అతిపెద్ద విజయం సాధించిన రెండో ఆసియా టీమ్‌గా టీమిండియా నిలిచింది. ఈ జాబితాలో భారత్ కంటే పాకిస్థాన్ ముందు వరుసలో ఉంది. 2002లో లాహోర్‌లో న్యూజిలాం డ్‌పై పాకిస్థాన్ ఇన్నింగ్స్ డ 324 పరుగుల తేడాతో విక్టరీ నమో దు చేసింది. ఈ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ ఎలో బ్యాటింగ్‌లో 28 రన్స్ చేసిన అతడు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. దీంతో టీమిండియా తరఫున ఆడిన తొలి మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.