బలమైన కథలు, భారీ సెట్లకు పెట్టింది పేరు దర్శకుడు గుణశేఖర్. 'బాల రామాయణం' 'చూడాలని ఉంది', 'ఒక్కడు' లాంటి సినిమాలతో సత్తా చాటిన ఆయన ఇప్పుడు ఈతరం కథతో 'యుఫోరియా' ను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను' అని ఇటీవల వ్యాఖ్యానించారు. 'డైరెక్టర్‌గా ప్రతిభచాటిన మీరు అలా ఎందుకు అనాల్సి వచ్చింది? ట్రోలింగ్ కారణమా?' అని గురువారం నిర్వహించిన ప్రెస్మిట్ లో ఓ విలేకరి ప్రశ్నించగా.. గుణశేఖర్ నమాధానమిచ్చారు. ట్రోలింగ్ సమస్య కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఓ దర్శకుడి ఒత్తిడి గురించి చెబుతూ ఆ మాట అన్నాను. డైరెక్టర్ సీటులో కూర్చున్న ఎవరికైనా స్టెస్ తప్పదు. ఏ ఉ ద్యోగంలోనైనా తృప్తి ఉంటుందిగానీ దర్శకులకు ఉండదు. తృప్తి ఉంటేనే కంటినిండా నిద్రపడుతుంది. అలాంటి నిద్రను 1992లో వదిలేసిన నేను ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నా. మళ్లీ హాయిగా వచ్చే జన్మలోనే నిద్రపోవాలన్న ఉద్దేశంతో డైరెక్టర్‌గా పుట్టను అని అన్నాను' అని వివరణ ఇచ్చారు. భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. తాజా ప్రెస్‌మిట్‌లో భూమిక, గుణశేఖర్ కుమార్తె, నిర్మాత నీలిమ గుణ తదితరులు పాల్గొన్నారు. విలేకరులతో 'యుఫోరియా' టీమ్ పంచుకున్న విశేషాలివీ.. హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటనను యథాతథంగా తెరపైకి తీసుకొచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీయాలని నిర్ణయించుకున్నా. కానీ, కథ రాయడం మొదలుపెట్టాక అన్ని నగరాల్లోనూ, విదేశాల్లోనూ అలాంటి ఘటనలు జరిగాయి. ఈ సినిమాలోని సీన్స్ వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలను గుర్తుచేస్తాయన్నారు.