ప్రస్తుతం హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనిప్రచారంలో భాగంగా దర్శకుడు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ విడుదలైనప్పుడు వచ్చిన రూమర్సైపై స్పందించారు. ప్రీలుక్ పోస్టర్లో హీరో వెనక నుంచి తీసిన ఫొటో ఉండటంతో అందులో ఉన్నది పవన్ కల్యాణ్ కాదు, హరీశ్ శంకరే స్వయంగా డూప్స్ నటించారనే వార్తలు వైరల్ అయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు ప్రేక్షకులు ఆయనే డూప్ గా నటించారని అన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తాను పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ డూప్ నటించలేదని స్పష్టం చేశారు. ఆ రూమర్లు చూసి తాను బాధ పడలేదని, పవన్ తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని సరదాగా అన్నారు.చిత్ర పరిశ్రమలో బాడీ డూప్‌ను ఎందుకు ఉ పయోగిస్తారనే విషయంపై కూడా హరీశ్ శంకర్ వివరణ ఇచ్చారు. షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం అస్తవ్యస్తమవుతాయని, దీనివల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆయన తెలిపారు. అందుకే హీరోల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రిస్క్ ఎక్కువగా ఉండే సన్నివేశాల్లోనే డూప్స్‌ను వాడతారని ఆయన వివరించారు.