టాలీవుడ్ 'దేశముదురు' బ్యూటీ హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్న వార్త అభిమానులను కొంత కలవరపెట్టినా, ఆమె స్పందించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. విడాకుల తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించిన హన్సిక, తన మనోధైర్యాన్ని చాటుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కష్టాల్లో కూడా పాజిటివ్ ఎలా ఉండాలో ఆమె తన పోస్ట నిరూపించింది. ఆ వివరాలు ఇలా వున్నాయి.. చట్టబద్ధంగా విడాకులు మంజూరైన మరుసటి రోజే హన్సిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “చార్టీ కలా ఆల్వేస్" (జష్టుతీసఱ ఋశ్రీు ఖశ్రీషుఎం) అని రాసుకొచ్చింది. ఈ పంజాబీ పదానికి అర్థం ఏమిటంటే.. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎంతటి కష్టం వచ్చినా అచంచలమైన ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం. తన వైవాహిక బంధం ముగిసినా, తాను కృంగిపోలేదని, రెట్టింపు ఉ త్సాహంతో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. ఏళ్ల తరబడి సైలెంట్‌గా ఉన్న హన్సిక, ఇలా ఒక్క మాటతో తన మనసులోని ధైర్యాన్ని చెప్పడం విశేషం. హన్సిక విడాకుల విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఆమె తన భర్త నుండి ఎలాంటి భరణం కోరలేదు. ఆర్ధిక ప్రయోజనాల కంటే తన ప్రశాంతతకే ఆమె ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. మార్చి 11న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఉన్న అభిప్రాయభేదాలు, జీవనశైలిలో మార్పుల వల్ల బంధం దెబ్బతిందని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. ఇక కేవలం ప్రశాంతమైన ముగింపు కోసమే హన్సిక ఎలాంటి డిమాండ్లు చేయకుండా విడాకులకు మొగ్గు చూపినట్లు ఆమె లాయర్ వెల్లడించారు.