క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ వివాహం వచ్చే నెల 05న జరగనుంది. అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్"ను పెళ్లాడనున్నాడు. ఈ క్రమంలో సచిన్ ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ జామ్ నగర్' లో అర్జున్ -సానియా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సచిన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో సచిన్ మాట్లాడాడు. తమ కుమారుడి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్'ను నిర్వహించినందుకు ముకేశ్ అంబానీ కుటుంబానికి థాంక్స్ చెప్పాడు. 'మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు థాంక్స్. అర్జున్- సానియా జంటను ఆశీర్వదించేందుకు ఇది సరైన వేదిక. ఎప్పుడైతే మన కుమారుడు, ఎవరైనా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడంటే, అప్పుడే కొడుకు పెద్ద వాడయ్యాడని తెలుస్తుంది. వాళ్లు (అర్జున్- సానియా) ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నిన్ను ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు. అర్జున్' నిన్ను చూస్తూ గర్విస్తున్నా' అని సచిన్ కుమారుడి పట్ల ఎమోషనల్'గా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల కిందట అనంత్-రాధిక పెళ్లి జరిగిన ఈ జామ్'నగర్?లోనే మళ్లీ అర్జున్- సానియా వివాహ వేడుక కోసం మనం కలుసుకున్నాం. సచిన్- అంజలీ ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులే. ఈరోజు మీకు ఆతిథ్యం ఇస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మా స్కూల్' లో చదువుతున్నప్పటి నుంచి అర్జున్'ను నేను చూస్తున్నా ఇప్పుడు నీ జీవితంలో ముఖ్యమైన, అందమైన జర్నీని ప్రారంభిస్తున్నావు. సానియా నీ చుట్టూ పాజిటివిటీ ఉంది. మీ ఇద్దరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం' అని నీతా అంబానీ అన్నారు. కాగా, సచిన్ తెందుల్కర్?కు అంబానీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముకేశ్?తో సచిన్?కు వ్యక్తిగతంగానూ అనుబంధం ఉంది. ముఖ్యంగా ఐపీఎల్' లో సచిన్ ముంబయి ఇండియన్స్'కు ఆడుతున్నప్పటి నుంచి ఇంకా దగ్గరయ్యారు. తెందుల్కర్ క్రికెట్ నుంచి (2013) రిటైరైన తర్వాత కూడా ఐపీఎల్? లో ముంబయి ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నారు. దశాబ్ద కాలంగా సచినే ముంబయికి మెంటార్'గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అర్జున్ తెందుల్కర్ కూడా ముంబయి జట్టుతోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. గతసీజన్? దాకా ముంబయితోనే ఉన్నాడు. అయితే 2026 సీజన్? కుగాను అతడిని లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ట్రేడింగ్? లో తీసుకుంది. పెంపుడు జంతువులకు గ్రూమింగ్, వెల్'నెస్ బ్రాండ్ అయిన మిస్టర్ పాప్స్ పెట్ స్పా డ స్టోర్ కూర్రా వ్యవస్థాపకురాలు సానియా చందోక్. ఆమె 2020లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వెటర్నరీ టెక్నిషియన్‌గా అర్హత సాధించారు. ఆమె గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘాయ్ మనవరాలు. ఆమె తల్లిదండ్రులు నన్నీ- గౌరిక కూడా ఈ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు.