అభిషేక్ పై యువరాజ్ సింగ్ ప్రశంసలు
టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ టోర్నమెంట్ లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఘోరంగా విఫలమైన ఈ యువ ఓపెనర్ తాజాగా జింబాబ్వేతో మ్యాచ్ లో అర్ధ శతకంతో రాణించాడు. 30 బంతుల్లో 55 పరుగులు చేసి, తన ఫామ్ పై మేనేజ్మెంట్ు ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశాడు. ఈ క్రమంలోనే అతడి ఇన్నింగ్స్ పై మాజీ క్రికెటర్, తన మెంటార్ యువరాజ్ సింగ్ మోటివేషనల్ మెసేజ్ పంపించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ రాసుకొచ్చాడు. 'అర్ధంలేని చర్చలు జరుగుతున్నప్పుడు బ్యాటింగ్ తోనే మాట్లాడావు. అభిషేక్ సార్ ఇది మంచి ప్రదర్శన. ఇలాగే ముందుకు సాగిపో' అని ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చాడు. అయితే ఈ టోర్నీలో అభిషేక్ వరుసగా ఫెయిల్ అవ్వడంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అందుకే అతడికి మద్దతుగా యువీ ఈ మెసేజ్ షేర్ చేశాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే ఈ మ్యాచ్ లో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్య, అర్షదీప్ సింగ్ పై కూడా యూవీ ప్రశంసలు కురిపించాడు. 'అద్భుతమైన పవర్ హిట్టింగ్. ఇన్నింగ్స్ ్స్ను అద్భుతంగా ముంగించావు' అని హార్దిక్‌ను ప్రశంసించగా, "స్పీడ్ స్టర్ అర్షదీప్ ట్రిపుల్ ధమాకా. సరైన సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్ధులను ఒత్తిడిలోకి నెట్టావు' అని యువీ పోస్టు చేశాడు. ఇటీవల అభిషేక్ విఫలం అవ్వడం వల్ల అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ కూడా అభిషేక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. 'అభిషేకక్కు డిఫెన్సివ్ క్రికెట్ ఆడడం రాదు. స్కిల్స్ లేవు, అతడు ఓ స్లోగర్ మాత్రమే అని వ్యాఖ్యానించాడు. అయితే ఆమిర్ వ్యాఖ్యలకు తాజాగా టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. తన దీనిపై యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు. 'అభిషేక్ పై మహ్మద్ ఆమిర్ చేసిన కామెంట్స్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే 'ఏ విధంగా అభిషేక్ మీకు స్లాగర్గా కనిపిస్తున్నాడు'. అతని ఆటతీరు గురించి మాట్లాడొచ్చు. కానీ, అలాంటి వ్యాఖ్యలు చేయడం నబబు కాదు. రీసెంట్గా జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ సూపర్' 'తన మెంటార్ యువరాజ్ సింగ్ అని అందరికీ తెలుసు. కానీ యువరాజ్ కంటే అభిషేకేకే పవర్ ఎక్కువ. తాను బాదిన బంతి ఎంతో దూరం వెళ్తుంది. అయితే, అతడికి స్కిల్స్ లేవని కొందరు అనుకుంటారు. కానీ అభిషేక్ జింబాబ్వేపై తాజా మ్యాచ్ లో అతడు అద్భుతమైన నైపుణ్యం దర్శించాడు' అని అశ్విన్ అభిషేక్‌పై ప్రశంసలు కురిపించాడు. అయితే తన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవ్వడంతో ఆమిర్ ఇప్పటికే దీనిపై సారీ చెప్పాడు. కాగా, ఈ మ్యాచ్ లో టీమ్లండియా బ్యాటర్లు హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ యువరాజ్ సింగ్ రికార్డ్‌ను నమం చేశారు. సింగిల్ టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్లుగా యువీ రికార్డ్‌ను హార్దిక్, ఇషాన్ సమం చేశారు. 2007 ఎడిషన్‌లో యువీ 12 సిక్స్‌లు బాదగా, ప్రస్తుత టోర్నీలో హార్దిక్, ఇషాన్ ఇప్పటికే చెరో 12 సిక్స్‌లు బాదేశారు. ఇంకో సిక్స్ బాదితే యువీ రికార్డ్ బ్రేక్ అవుతుంది. అయితే పొట్టి కప్పులో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత్ బ్యాటర్‌గా రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. అతడు 2024లో 15 సిక్స్‌లు కొట్టాడు.