ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా నుంచి తాజాగా ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు చూడని కొత్త గెటప్ లో ప్రభాస్ కనిపించనున్నారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తుండగా, కథలో మాఫియా నేపథ్యానికి కూడా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్, భావోద్వేగాలు కలగలిసిన కథతో సినిమా రూపొందుతోందని సమాచారం. కథానాయికగా త్రిప్తి దిమ్రీ నటిస్తోంది. అలాగే సీనియర్ నటి కాంచన కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. విడుదల తేదీగా 2027 మార్చి 5ను నిర్ణయించారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.