మొదటి గ్రూప్ నుండి భారత్, దక్షిణాఫ్రికా
రెండో గ్రూప్ నుండి ఇంగ్లాండ్
న్యూజిలాండ్ సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు.
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఆదివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీన్పై భారత జట్టు 5 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సంజూ శాంసన్ 97 పరుగుల అజేయ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి, ఇండియాను సెమీ ఫైనల్‌కు చేర్చారు. సెమీఫైనల్లో చోటు దక్కించుకున్న నాలుగో జట్టు భారత్, భారత్‌తో పాటు ఫైనల్-4 బెర్త్ దక్కించుకున్న మిగిలిన మూడు జట్లు ఏవి, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో వివరాలు ఇక్కడ తెలుసుకోండి. భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ చేరాయి. భారత్ కంటే ముందే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. సూపర్-8లోని మొదటి గ్రూప్ నుండి భారత్, దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ చేరగా, రెండో గ్రూప్ నుండి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తుది-4లో చోటు దక్కించుకున్నాయి. ఆసియా నుంచి చాలా దేశాలు టోర్నీ ఆడినా కేవలం భారత్ మాత్రమే సెమీ ఫైనల్స్ చేరుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తమ తమ గ్రూపుల్లో ఆగ్రస్థానంలో నిలిచి సెమీ ఫైనల్ చేరుకున్నాయి. మార్చి 1న రాత్రి ఉ త్కంఠభరితంగా జరిగిన మ్యాచులో ఇండియా ప్రత్యర్థి వెస్టిండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ 4లో చోటు దక్కించుకుంది. ఇక సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకను 65 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడించలేకపోవడంతో. న్యూజిలాండ్ సెమీఫైనల్స్ చేరిందని తెలిసిందే. 2026 టీ20 వరల్ వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 4న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఇందులో విజేత తొలి ఫైనలిస్ట్ అవుతుంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. రెండో ఫైనలిస్ట్ డిసైడ్ చేసే మ్యాచ్ ఇది.