మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పెద్ది' రెండో సింగిల్ 'రాయ్ రాయ్ రా రా' విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. తొలి పాట 'చికిరి కిరి'కి మంచి స్పందన లభించిన నేపథ్యంలో రెండో సాంగ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి ఎలాంటి ప్రోమో విడుదల చేయకపోవడంతో పాట రిలీజ్ టైమ్‌పై కొంత గందరగోళం నెలకొంది. తాజా అప్డేట్ ప్రకారం 'రాయ్ రాయ్ రా రా' పాటను మంగళవారం సాయంత్రం 7:02 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ టైమ్‌ను కన్ఫర్మ్ చేస్తూ చరణ్ కి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో చరణ్ మాస్ అవతార్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట మోటివేషనల్ టచ్ తో కూడిన మాస్ నంబర్ ఉ ండనుంది. ముఖ్యంగా చరణ్ డాన్స్ మూవ్స్ ఈ సాంగ్‌కు హైలైట్ అవుతాయని టాక్. తన ఎనర్జీ, గ్రేస్‌తో చరణ్ మరోసారి అభిమానులను అలరించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సాంగ్‌పై భారీ చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.