పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నది. ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన దేఖ్ లేంగే సాలా, సాంగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. మేకర్స్ ఏదో ఒక ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన లుక్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌గా పవన్ కల్యాణ్ తన దైన స్టైల్లో చైర్‌పై కూర్చొని ఛిల్ అవుట్ మూడ్‌లో ఉండటం చూడొచ్చు. ఈ స్టిల్ చూస్తుంటే అభిమానులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పుష్కలంగా ఉండబోతున్నట్టు హరీష్ శంకర్ హింట్ ఇచ్చేస్తున్నాడు. తాజా లుక్ అభిమానులు, మూవీ లవర్స్‌లో మరింత హైప్ పెంచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.