యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియన్ సినిమా పై తాజాగా క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. వర్కింగ్ టైటిల్: డ్రాగన్ పేరుతో ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్ తో నైట్ షూటింగ్ నిర్వహించారని టాక్. తదుపరి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ అంటేనే భారీ యాక్షన్, డార్క్ టోన్, పవర్ఫుల్ ఎలివేషన్లు గుర్తుకు వస్తాయి. అదే ఫార్ములాను ఈసారి ఎన్టీఆర్ స్థాయికి మించి చూపించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సులు అత్యంత ఇంటెన్గా ఉ ండబోతున్నాయట. ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ యాక్షన్ రోల్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన అన్ని సినిమాల్లోకెల్లా ఇదే బెస్ట్ మూవీ అవుతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌసెస్ గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రవి బస్రూర్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఇందులో కథానాయికగా రుక్మిణి వసంత్, కీలక పాత్రలో అనిల్ కపూర్ కనిపించినున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ రూపొందుతోంది. జూన్ 25 సినిమాని విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు.