జంటగా వెండితెర అయినా బుల్లితెర అయినా ఒక అమ్మాయి, అబ్బాయి కనిపించారంటే చాలు వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనే ఆలోచన లేకుండా.. ఎఫైర్ రూమర్స్ అంటగడుతూ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆకతాయిలు అంతటితో ఆగకుండా ఏకంగా వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి మరీ ఫలానా వ్యక్తులతో రిలేషన్ లో ఉన్నట్టు చెబుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ తో దీపిక పిల్లి రిలేషన్ ఉన్నట్టు వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీటిపై స్పందించి ఊహించని షాక్ ఇచ్చింది దీపిక పిల్లి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. బుల్లితెర మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ అటు బుల్లితెరపై ఇటు వెండితెర పై కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.. ఒకప్పుడు రష్మీతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు రాగా.. అది కేవలం స్నేహం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు సుధీర్ ప్రేమ, పెళ్లి విషయాలపై సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.. అయితే తాజాగా సుధీర్ లేడీ యాంకర్ దీపిక పిల్లి ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరూ కలిసి విదేశాలలో విహరిస్తున్నారు. అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొట్టింది. పైగా ఈ ఫోటో దీపికా పిల్లి ఇనాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అవ్వడంతో సుధీర్ అభిమానులంతా నిజమే అని నమ్మేశారు. ఇక ఈ వార్త అలా వైరల్ అవ్వడంతో వెంటనే దీపిక పిల్లి స్పందించింది. దీపిక సుధీర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్త సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ..” నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ ఫోటోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. గత రాత్రి నా స్టోరీలో కనిపించిన ఈ ఫోటో ఏఐ ద్వారా సృష్టించబడింది. నా అనుమతి లేకుండా ఎవరో దానిని పోస్టు కూడా చేశారు. 24 గంటలుగా నా ఖాతాలో వస్తున్న ఏ కంటెంట్‌తో కూడా నాకు సంబంధం లేదు" అంటూ తన అకౌంటు హ్యాక్ అయిందన్న విషయాన్ని అలాగే సుధీర్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు ఆమె చెక్ పెట్టింది.. ముఖ్యంగా సదరు ఫోటోని ఎవరూ షేర్ చేయొద్దని దీపిక అభిమానులను రిక్వెస్ట్ కూడా చేసింది.