పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు
అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాలో ఏటా 20 వేలు జమ
సూరంపల్లిలో అన్నదాత సుఖీభవను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రూ.2,316 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు
చిన్నతరహా పరిశ్రమల ద్వారా 17 వేల మందికి కొత్తగా ఉపాధి
3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సాయం
'సఖీ నివాస్' పేరుతో పిల్లల సంరక్షణకు హాస్టళ్ల ఏర్పాటు
ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం
గ్యాస సరఫరాలో ఇబ్బందులు రాకుండా మంత్రుల పర్యవేక్షణ
కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
అమరావతి : అమరావతిలో ప్రతిష్ఠాత్మకమైన సచివాలయం, ప్రభుత్వ విభాగాధిపతుల టవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్ల పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నాజధానిలో తెలుగు సంస్కృతిని చాటిచెప్పేలా రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దీనిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో శు క్రవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేసింది. చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా 17 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.
దీనికోసం 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. మహిళా ఉద్యోగుల కోసం నఖీ నివాస్' పేరుతో పిల్లల సంరక్షణ సౌకర్యాలు కలిగిన హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. పోలీసు శాఖలో 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పబ్లిక్ ఎంఎ÷-లాయ్మెంట్ ఆర్డర్లో పోలవరం, మార్కాపురం జిల్లాలను చేర్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పనుల కోసం దాదాపు రూ.48 కోట్లను అదనంగా కేటాయించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని, ఆ లోపు కాలువలు, డ్రెయిన్ల మ-రమ్మతుల కోసం 'జలధార కార్యక్రమాన్ని ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తిరుపతి, విజయవాడ, విశాఖ అప్పీల్ కార్యాలయాల పరిధిపై నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట గెజిట్ క్కు ఆమోదం పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి వంపే అజెండాకు అమోదం. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్‌లో అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు రూ.23.47 కోట్లు కేటాయింపు, పోలవరం ప్యాకేజ్-64 పనులకు రూ.24.51 కోట్లు మంజూరుకు అనుమతి లభించింది. ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో అత్యవసర మరమ్మతు పనులకు నిధుల మంజూరు చేస్తూ ఆమోదించింది. క్యాబినెట్లో అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ అంశాలపై సీఎం చర్చించారు. గ్యాస్ కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ ఉ ండాలన్నారు. కొందరు గ్యాస్క బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లు వాడుతున్నారని మంత్రి వయ్యావుల కేశవ్ అన్నారు. ఎలక్ట్రిక్ స్టవ్‌లతో విద్యుత్ డిమాండ్ పెరగడంతో పరిస్థితి పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఏప్రిల్ 2న శాఖల పనితీరుపై నివేదికలు ఇస్తానని, వాటి ఆధారంగా సమీక్ష చేసుకొని పురోగతి సాధించాలని సూచించారు. ఏప్రిల్ 2 నుంచి 90 రోజులపాటు జలధార కార్యక్రమం చేపట్టాలన్నారు. కాలువలు, డ్రెయిన్లు శుభ్రం చేయించి భూగర్భ జలాలను పెంచాలన్నారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. చివరి ఎకరానికి కూడా నీరిచ్చేలా జలధార కార్యక్రమం జరగాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు గ్యాస్ సరఫరా, విద్యుత్ వినియోగంపై చర్చించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరత వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ స్టవ్లల వైపు మళు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2న ప్రభుత్వ శాఖల పనితీరుపై నివేదికలు విడుదల చేస్తానని.. ఆ ఆధారంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రులకు దిశానిర్దేశంచేశారు.
ఏపీ జెన్కో అద్భుత ప్రతిభ
ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
అమరావతి: ఏపీ వవర్ జనరేషన్ కార్పొరేషన్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఈ నెల 11వ తేదీన, 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ రికార్డు ఒక్కరోజే సాధించడం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ మనత సాధించడంలో భాగస్వాములైన జెన్కో ఎ+-లాంట్ల కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి, మొత్తం జెన్కో టీమ్‌కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జెన్కో సాధించే విజయాలు రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒకే రోజు 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించటం జెన్కోకి చరిత్రాత్మక ఘనత అని వెల్లడించారు. ఈ విజయంతో ఆంధప్రదేశ్ విద్యుత్ రంగం భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.