అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఎఎ23గా ఇది ప్రచారంలో ఉ ంది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ సినిమా అప్పుడే సోషల్ మీడియాలో రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ థీమ్ సాంగ్ విడుదల చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా ఈ థీమ్ సాంగ్‌పై ఇన్‌స్టాలో 3,55,000 రీల్స్ క్రియేట్ అయ్యాయి. కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతోన్న 'ఎనిబిసనీటబీఇ ఓ'బ'-బి వీడియోకు ఈ సాంగ్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో 13 రోజుల్లోనే లక్షల రీల్స్ ఈ పాటతో క్రియేట్ అయ్యాయి. అత్యధిక రీల్స్ పొందిన థీమ్ సాంగ్ ఈ పాట రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ టాప్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా అట్లీ దీని గురించి మాట్లాడుతూ.. అద్భుతమైన అవుట్‌పుట్ కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లు చెప్పారు. అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.