రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్డి మార్చే యత్నం
జగన్ హయాంలో పెట్టుబడిదారుల పరార్
నీటి వినియోగంలో జాగ్రత్తలు ముఖ్యం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి
జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు
రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కేవలం సంబంధిత శాఖల పనే కాదని, ఇకపై జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడి దారులను గుర్తించి, ఒప్పించి, వారికి అన్ని విధాలా సహకర్తిం చేందుకు 'కమిట్మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్' అనే 3% ఫార్ములాను ఆయనవ నిర్దేశించారు. పెట్టుబడుల విషయంలో కలెక్టర్ల పనితీరును అంచనా వేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ఆధారంగా ర్యాంకులు ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు పెట్టుబడులు, పర్యాటక రంగాతి పై వర్వపం మారః నిర్వహించారు.
అమరావతి: నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉ ందన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. పెట్టుబడులు, వైద్యం, సూపర్ సిక్స్- సంక్షేమం. ఆదాయార్జన శాఖలు, విద్య- నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సంపద సృష్టించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎలా ఉన్నామో జిల్లాల వారీగా వివరాలు ఉండాలి. గత వైకాపా హయాంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన పరిస్థితి అందరం చూశాం. వనరులు ఉన్నా నరైన రీతిలో ఉ పయోగించుకోవాలి. లేదంటే వ్యర్ధమేనని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశర చేశారు. సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. కుటుంబ సాధికారిత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ పథకాల లబ్దిదారులకు ప్రజా ప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందివ్వాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాల పారదర్శకతతో అమలుకు, ఓనర్షిప్ తీసుకునేందుకు సంక్షేమ లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. పెట్టుబడుల గురించి ఆలోచించినట్లే... పేదల గురించి ఆలోచించాలని సూచించారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఓ లేఖను లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశర చేశారు. లబ్దిదారులకు ప్రతీ నెలా ఏం లబ్ది కలిగిందో తెలియజేయాలని సూచించారు. ఏ కుటుంబానికి ఏం లబ్ది కలిగిందో తెలిస్తే అంతా పారదర్శకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందించే పెన్షన్, ఉచిత సిలిండర్, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి లబ్దిదారులకు తెలియాలని సూచించారు. దీపం 2.0 వథకానికి డిజిటల్ ఓచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. డీబీటీ పథకాల్లో ప్రోగ్రామబుల్ వోచర్లను లబ్దిదారులకు ఇస్తే వారు వినియోగించుకుంటారన్నారు. మార్చి 9వ తేదీ నాటికి ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా 50.45 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారని.. రూ.1775 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీయంబర్న్ చేసిందని వివరించారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవలను వినియోగించుకుని పీ4తో సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని నమర్థవంతంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. అన్నదాత సుఖీభవ ద్వారా రేపు మూడో విడత నిధులు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్నాక్యాంటీన్ల ద్వారా 7.5 కోట్ల భోజనాలు ఇప్పటి వరకూ పేదలకు అందించగలిగామని చెప్పుకొచ్చారు. అంగన్వాడీ, ఆశాలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్నామని అన్నారు. రూ. వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టామని తెలిపారు. వల్లె పండుగ కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. సంక్షేమ పథకాలు పేదలందరికీ అందించడమే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీ ఒక్కరికీ ఇంటిస్థలం లేదా ఇంటిని మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉగాదికి 2.50 లక్షల మందికి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీ ఇంటికీ జేజేఎం కింద తాగునీటి కుళాయి ఇస్తామని... ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాలిడ్, లిక్విడ్ మేనేజ్మెంట్ ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెట్ జీరో కాన్సెప్టుగా మన వ్యర్ధాలను వేస్ట్ టూ ఎనర్జీ ఎ+-లాంట్లకు చేయాలని తరలించాలని ఆదేశించారు. తడి వ్యర్ధాలను కంపోస్టు తయారు చేసేందుకు మళ్లించాలని సూచించారు. 500 పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్టులో కిచెన్ గా+-డర్గి+న్, బయోడైవర్సిటీలో భాగస్వాములను సూచించారు. వీబీజీ రామ్ జీ కింద రూ.9773 కోట్లు ఏపీకి కేటాయించారని అన్నారు. ఇప్పుడు ఈ పథకం డిమాండ్ డ్రివెన్ కాదని... దీనికి అనుగుణంగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెట్టుబడుల గురించి ఎలా ఆలోచిస్తున్నామో... పేదలకు అందించే సంక్షేమం గురించి... వారికి కల్పించే సాధికారత గురించి కూడా కలెక్టర్లు ఆలోచించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.