టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిలుస్తారు అంటూ వారి అభిమానులు ఎX=న్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. వీరి పెళ్లికి ముందు వరకు అన్ని విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చిన వీరు పెళ్లి తర్వాత అంతా ఓపెన్ అయ్యారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా అందంగా కనిపించారని, ఇద్దరూ పెళ్లి కలతో కలకలలాడుతున్నారు అంటూ తెగ కామెంట్స్ వచ్చాయి. పెళ్లి తర్వాత రెండు మూడు రోజులు హడావిడి ఉండటం చాలా కామన్ విషయం కానీ పెళ్లి అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ వీరి పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ పెళ్లి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆశీర్వాదం తీసుకోవడంతో పెద్ద చర్చకు తెర తీయడం జరిగింది. ఇప్పుడు అన్నదానం కారణంగా చర్చలో నిలిచారు. ఎంతో మంది స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ వివాహం చేసుకున్నారు. స్టార్ కపుల్, క్రేజీ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క స్టార్ సెలబ్రిటీ పెళ్లికి జరగని విధంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల యొక్క వివాహం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో అన్నదానం నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏకంగా 16 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమంను నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. నేడు ఈ అన్నదాన కార్యక్రమాలను అభిమానుల సహకారంతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిర్వహిస్తున్నారు. కేవలం అన్నదానం మాత్రమే కాకుండా మరో పది నుంచి పదిహేను ముఖ్య పట్టణాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి సందర్భంగా స్వీట్స్ ను పంపిణీ చేయడం ద్వారా అక్కడి వారి ఆశీర్వాదం అందుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగింది. దాంతో బాలీవుడ్లో భారీ ఎత్తున ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ సైతం స్టార్ హీరోల జాబితాలో చేరాడు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మంచి స్పందన దక్కించుకున్నాయి. ముఖ్యంగా గీతా గోవిందం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి కాంబోకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.