విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ కాంబోలో రానున్న సినిమా టైటిల్ ఖరారయ్యింది, ఇప్పటివరకూ 'పూరి సేతుపతి'గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్ను తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'స్లమ్ డాగ్' అనే పేరు ఖరారు చేశారు. '33 టెంపుల్ రోడ్' అనేది ఉపశీర్షిక, టైటిల్ పోస్టర్లో విజయ్ సేతుపతి ఆసక్తికర లుక్లో కనిపించారు. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్ఫుల్గా ఉన్నారు. ఈ పోస్టర్ను పంచుకున్న టీమ్ ఆసక్తికర క్యాప్షన్ను షేర్ చేసింది. 'మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది' అనే క్య
Continue Read
టాలీవుడ్లో 'లక్కీ హీరోయిన్'గా పేరు తెచ్చుకున్న అందాల భామ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో పుల్ జోష్ కొనసాగుతోంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన 'వస్తున్నాం' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె, ఇప్పుడు మరోసారి పండగ సీజన్ నన్ను టార్గెట్ చేస్తోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు' తో ఈసారి కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చుకోగా, ప్రమోషన్స్లో మీనాక్షి చౌదరి
Continue Read
'పండగకు వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..' అంటూ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చి సందడి చేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు హిట్ టాక్ రావడంతో మొదటిరోజు వసూళ్లపై అందరిలోను ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ వివరాలను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు వసూలుచేసినట్లు వెల్లడించింది. 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ ను బద్దలు కొ
Continue Read
శోభితా ధూళిపాళ్ల ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'చీకటిలో'. అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి 23 నుంచి స్టీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ ను విడుదల చేశారు. న్యూస్ ఛానల్ లో యాంకర్ జాబ్ మానేసి సొంతంగా ఛానల్ పెట్టి స్నేహితుల హత్యల వెనక ఉన్న కారణాన్ని కనిపెట్టే సంధ్య పాత్రలో శోభిత కనిపించారు.
Continue Read
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది రాజాసాబ్ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందింది. మైండ్ గేమ్ ఛాలెంజింగ్గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. నైజాం ప్రీమియర్స్ పరంగా కాస్త దెబ్బ పడిన ఓవరాల్ మాత్రం సాలిడ్ స్టార్టప్ అందుకుంది రాజాసాబ్. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 112 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో.. ప్రభాస్ కెరీర్లో వంద కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన 6వ సినిమాగా రాజాసాబ్ రికార్డ్ నమోదు చేసింది. మిక్స్డ్ టాక్ వచ్చిన సరే ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తున్నాడు రాజాసాబ్.
Continue Read
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి రబ్బీర్ కపూర్ యానిమల్ మూవీతో పాపులారిటీని సొంతం చేసుకున్న త్రిప్తి ఈ మూవీతో అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్తో బాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తూ టాప్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటిస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ "స్పిరిట్" ప్రభాద్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తనకు జోడీగా త్రిప్తి రిమ్రి నటిస్తోంది. ఇప్పటి
Continue Read
'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు 'పుష్ప2', 'ఓజీ', గేమ్ ఛేంజర్', 'అఖండ 2' చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో తాజా చిత్రాల నిర్మాతలకు ఊరట లభించినట్లయ్యింది. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Continue Read
ప్రభాస్-అనుష్క స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే వాళ్లిద్దరుప్రేమికులు అయ్యారా? పెళ్లి చేసుకుంటున్నారా? అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఇద్దరు కేవలం ఓ మంచి స్నేహితులు మాత్రమే. స్నేహితులుగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు ఎంతో గొప్పగా సాగుతోంది. ప్రస్తుతం కలిసి నటించ కపోయినా? వారి మధ్య స్నేహం మాత్రం అంతే పదిలంగా ఉంది. ప్రభాస్ కు మంచి పిల్ల దొరకాలని, ఆ పిల్లని తానే పెళ్లి కూతుర్న
Continue Read