బడులు తెరిచే నాటికి సిద్ధమవ్వాలి
అర్బన్ ప్రాంతాల్లోనూ జలధార తాగునీరు,
పారిశుధ్యం, వీధి దీపాల సమస్య రాకూడదు
పేదలు సంతృప్తికరంగా భోజనం చేసేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ
వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వనతులతో సిద్ధంగా ఉ ండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ హాస్టల్ గాడిలో పడాలని, అన్ని రకాల వసతులు ఉ ండాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం లోని ఆర్టీజీఎస్ కనుంచి కనుం క్షేత్రస్థాయిలో వివిధ వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, జూన్ లో స్కూళ్ల రీ-ఓపెనింగ్ నాటికి హాస్టళ్లు అన్నీ చక్కగా ఉండాలి. విద్యార్థు లకు సౌకర్యవంతంగా ఉండాలి. టాయిలెట్లు.. ఆర్వో ప్లాంట్లు సిద్ధంగా ఉండాలి. హాస్టళ్ల కు సంబంధించి వనతులపై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాకూడదు అని స్పష్టం చేశారు. హాస్టళ్లల్లో వసతులు మెరుగు పరిచేందుకు నిధులు కేటాయించాం. సాస్కీ నిధులతో ఈ పనులు చేపడుతున్నాం. నిధులు అందించిన తర్వాత కూడా ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుందన్నారు. వసతులను ఏర్పరచడమే కాకుండా, వాటిని సక్రమంగా నిర్వహించేలాక నిర్వ వాడా చూడాలి. ఈ మేరకు నిరంతర పర్యవేక్షణ చేపడుతూనే ఉండాలని నిర్దేశించారు. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలి. ఇక నగరాలు, పట్టణాల్లో మౌళిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలూ కన్పించకూడదు అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాగునీటి సరఫరా, వీధి దీపాల విషయంలో ఫిర్యాదులు రాకూడదు. అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉండడానికి వీల్లేదు అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా మౌళిక సదుపాయల కల్పన విషయంలో ఫిర్యాదులు రాకూడదన్నారు. తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. తీసుకో వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి. తాగునీటిని అందించడంతో పాటు స్వచ్చ మైన తాగునీరు ప్రజలకు అందించేలా చూడాలని నిర్దేశించారు. తాగునీటి పైప్ లైన్లల్లో డ్రైనేజీ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచూ నీటి శాంపిళ్లను కలెక్ట్ చేసి ల్యాబుల్లో టెస్ట్ చేయించాలని దిశా నిర్దేశం చేశారు. వీధి దీపాలు నిరంతరం పని చేస్తూనే ఉండాలి. సెన్సిటివ్ ప్రాంతాల్లో వీధి దీపాల సమస్య ఉండకూడదన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణ ఎక్కడా ఆగకూడదు అని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ వంటి అంశాల్లో ఫిర్యాదులు వచ్చి వచ్చిన వెంటనే పరిష్కరించే మెకానిజం ఉండాలన్నారు. పని పూర్తి చేశాక స్థానికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది... మున్సిపల్ అధికారులు స్పందించారనే బావన ప్రజలకు కలిగేలా చేయాలన్నారు. మున్సిపల్ కమిష కమిషనర్లకు స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారుల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ ఫలితాలు స్పష్టంగా పట్టణాల్లో కన్పించాలన్నారు. తాడిపత్రి పట్టణంలో పారిశుద్ధం చక్కగా నిర్వహిస్తారు. అక్కడి నాయ కులు చొరవ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేతలు చొరవ తీసుకున్న చోట మంచి ఫలితాలు కనిపిస్తున్నా యని సీఎం చంద్రబాబు అన్నారు. స్వచ్ఛత విషయంలో తాడిపత్రి రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళల భద్రతే హై-ప్రయారిటీ... మహిళలపై నేరాల విషయంలో ఏ మాత్రం అలక్ష్యం విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణల ఆలోచనలు... రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వీలైనన్ని ఇన్నోవేషన్లు వచ్చేలా చూడడంతో పాటు విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలు చేయాలన్న ఆలోచనలు రేకెత్తించే విధంగా చొరవ తీసుకో వాలని సీఎం చంద్రబాబు సూచించారు. యంగ్ స్టూడెంట్ ఇన్నోవేటర్లను తీర్చిదిద్దేలా చూడాలన్నారు. అగస్త్య వంటి సంస్థలు విద్యార్థుల్లో ఆవిష్కరణను ప్రోత్సహిస్తున్నాయి. వినూత్నంగా ఆలోచన చేస్తున్నాయి. ఇలాంటి సంస్థలతో ఆర్టీఐహెచ్ కలిసి పని చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చన్న అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. 175 నియోజ కవర్గాల్లో ఉండే ఎంఎంస్ఎంఈ పార్కులతో ఆర్టీఐహెచ్ అనుసంధానమై పని చేస్తే ఎలా ఉంటుందో ప్రణాళికలు సిద్దం చేయండి అని అధికారులను ఆయన ఆదేశించారు. ఎన్విడియా వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇలాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తే ఎకో సిస్టం ఏర్పడుతుందన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించే అంశంపై ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాల్లో డ్రోన్ల ద్వారా హెల్త్ సర్వీసులు అందించే పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలని, ఈ ప్రయోగం దేశానికి ఓ మోడల్ లా ఉ ండాలన్నారు. జలధార కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలి. నరేగా అనుసంధానంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో యంత్రాలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని చెరువులకు నీళ్లు నింపే విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్ అవలంభించాలన్నారు. డ్రైన్లు, కాల్వలను బాగు చేయాలి. 15వ తేదీన సాగుకు నీటి విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జలధార పనులు చేపట్టాలి. అవసరమైతే అన్నమయ్య జిల్లాకు మిగిలిన జిల్లాల నుంచి బృందాలు పంపి ట్రైనింగ్ ఇప్పించండి. అని ఆయన అధికారులను ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా జలధార కార్యక్రమం చేపట్టాలి. జలధారపై ప్రతీవారం సమీక్షిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వద్దు. మహిళల జోలికి రావాలన్నా, అఘాయిత్యం చేయాలనే ఆలోచన రావాలన్నా ఒణికి పోయే పరిస్థితి తీసుకురావాలని పోలీస్ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నామో, దానికి పదింతల ప్రాధాన్యత మహిళలు, చిన్నారుల భద్రతకు ఇస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలను పాటించే విషయంలో నేరాలను కట్టడి చేసే సందర్భంలో ఏ మాత్రం రాజీ పడొద్దు అని స్పష్టం చేశారు. తప చేసిన వారిని త్వరితగతిన అరెస్ట్ చేయడమే కాదు, వారికి శిక్షలు పడేలా చూడాలని నిర్దేశించారు. మహిళల్లో భయాన్ని పోగొట్టాలి. తప్పు చేసే వారిలో భయాన్ని పెంచాలి. మహిళా భద్రతకు సంబంధించి నిరంతరం ప్రజల్లో అవ గాహన పెంచాలని చెప్పారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, సాగు, వినియోగం ఉండేది. నాటి పరిస్థి తితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిందన్నారు. గంజా, డ్రగ్స్ ప్రభావం కన్పించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజా నివారణకు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈగల్ విధా నాన్ని ఒడిషా ప్రభుత్వం అధ్యయనం చేసింది. మన రాష్ట్ర విధా నాన్నే ఒడిషా అవలంభిస్తోంది అని సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడించారు.
పేదలకు కడుపు నింపడం ప్రభుత్వ బాధ్యత...
అన్న క్యాంటీన్లను మరింత విస్తరిస్తున్నాం. అర్బన్ ప్రాంతాల్లోనే కాకుండా రూరల్ నియోజకవర్గాల్లో కూడా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదవాడికి కడుపునిండా అన్నం పె ట్టడమనేది ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. పేదలు సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేసేలా అన్న క్యాంటీన్లను నిర్వహించాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ ఎలా ఉందో తెలుసుకోవడానికి అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కొత్తగా అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే ఏడాదికి సుమారు రు రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న క్యాంటీన్లకు స్వచ్చంధంగా విరాళాలు ఇచ్చేలా మోటివేట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.