గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ క్యాచౌట్ ప్రస్తుతం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాటీదార్ ఇచ్చిన క్యాచ్'ను అందుకునే ప్రయత్నంలో గుజరాత్ ఫీల్డర్ జేసన్ హోల్డర్ కింద పడ్డాడు. ఆ సమయంలో బంతి నేలను తాకినట్లు వీడియోలో కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ దీనిని ఔట్గా ప్రకటించడంతో వివాదం చెలరేగింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా దీనిపై మాట్లాడాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానెల్? లో మాట్లాడుతూ, థర్డ్ అంపైర్ నిర్ణయంపై తన అభిప్రాయం షేర్ చేసుకున్నాడు. అంపైర్ నిర్ణయం సరైందేననిఅన్నాడు. అయితే ఆర్సీబీ తరఫున చూస్తే పాటీదార్? దురదృష్టవశాత్తు ఔటయ్యాడని అనిపిస్తుందని, అదే గుజరాత్ టైటాన్స్ తరఫున చూస్తే అది క్లియర్ ఔట్'గా కనిపిస్తుందని అన్నాడు. అయితే తటస్థ ప్రేక్షకుడిగా చూస్తే మాత్రం అది కచ్చితంగా ఫెయిర్ క్యాచ్ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు లైవ్లో బంతిని తన చేతిలో చూపిస్తూ నిబంధనలతో సహా ఓ ఉదాహరణ చెప్పాడు. 'ఇది క్రికెట్ మ్యాచ్" లో ఉపయోగించే కూకబూర (బంతి కంపెనీ) బాల్. ఈ బంతిని పట్టుకుంటే దాదాపు అది నా చేతిలో కవర్ అయిపోతుంది. అదే హోల్డర్ చేయ్యి నా కంటే ఇంకా పెద్దదిగా ఉంటుంది. అతడు బంతిని చేతిలో పట్టుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది. అసలు చేతిలో బంతి ఉన్నట్లు కనిపించదు. అతడు కిందపడే సమయానికి తన వేళ్లతో బంతి కింద తాకకుండా కవర్ చేశాడు. నాకు తెలిసి బహుశా బంతి నేలను తాకి ఉ ండదు. ఇక ఆటలోని నిబంధనలు తెలుసుకోవడం ఇక్కడ మరో విషయం' 'ఫీల్డ్ అంపైర్లు గానీ, థర్డ్ అంపైర్ గానీ చాలా అనుభజ్ఞులు ఉంటారు. రిప్లైలో అంపైర్లు ఏ యాంగిల్ లో బంతిని గమనిస్తారనేదే నిబంధనల సారాంశం. అక్కడ హోల్డర్ క్యాచ్ అందుకున్న వెంటనే, తన వేళ్లతో బంతిని పూర్తిగా కవర్ చేస్తూ, దానిని నేలను తాకకుండా చూసుకున్నాడు. అందుకే ఇది ఆర్సీబీ తరఫున చూస్తే ఇది దురదృష్టం అనిపించవచ్చు. కానీ గుజరాత్ పాయింట్ ఆఫ్ ది వ్యూ లో చూసుకుంటే అది క్లీన్ క్యాచ్లగా అనిపిస్తుంది. అదే తటస్థ ప్రేక్షకుడి కోణంలో చూసుకుంటే అది రూల్ ప్రకారం సరైన నిర్ణయమే' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ క్యాచ్ వివాదంపై ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు. 'ఆ క్యాచ్ పట్టిన సమయంలో అక్కడ నేను లేను. అయితే ఆ తర్వాత క్యాచ్ వీడియో చూశాను. కానీ, నాకు మాత్రమ బంతి నేలను తాకినట్లే అని అనిపించింది. మరి అప్పుడు అంపైర్ ఏం చెప్పారో నాకైతే తెలీదు. ఆట నిబంధనలకు లోబడి ఉందా లేదా అనేని నేను చెప్పలేను. దీనిపై పెద్దగా అవగాహన కూడా లేదు. కానీ ఈ క్యాచ్'ను ఇంకొంచెం నిశితంగా పరిశీలించి ఉండి ఉంటే బాగుండేదనని అనిపించింది' అని భువనేశ్వర్ అన్నాడు. ఇక స్వయంగా ఈ క్యాచ్ పట్టిన హోల్డర్ మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడాడు. తాను అందుకున్న క్యాచ్ సరైందే అని అన్నాడు. క్యాచ్ పట్టే సమయంలో రబాడ తనను ఢీ కొట్టేలాగా కనిపించినప్పటికీ బంతి అందుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు. ఇక అదిరే ఫీల్డింగ్తోపాటు బౌ లింగ్లో రెండు వికెట్లు పడగొట్టి రాణించిన హోల్డర్'కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.