టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్ద కాలానికి పైగా అగ్ర హీరోల సరసన గ్లామరస్ పాత్రల్లో మెప్పించిన అమ్మడు కెరీరు సరికొత్త మార్గంలోకి మళ్లించాలని భావిస్తున్నారు. ఇకపై కమర్షియల్ సినిమాలకు, పాటలకే పరిమితమయ్యే పాత్రలకు దూరంగా ఉ ండాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. సమంత తీసుకున్న నిర్ణయం వెనుక బలమైన ఉద్దేశ్యం కనిపిస్తోంది. -సినిమాలో కథే అసలైన హీరో అని ఆమె బలంగా నమ్ముతున్నారు. స్టార్ హీరోల ప్రాజెక్టులలో భాగం కావడం కంటే నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో -మా ఇంటి బంగారం- అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఓ రకంగా ఈ చిత్రమే కొత్త ప్రయాణానికి పునాదిగా కనిపిస్తోంది. ఇది పూర్తిగా స్త్రీ ప్రధాన కథాంశంతో రూపొందుతున్న సినిమా. ఒక సామాన్య మహిళ ఎదుర్కొనే సవాళ్లు, ఆమె సాధించే విజయాల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. టైటిల్ వినడానికి సాప్ట్ ఉన్నా? సినిమాలో సమంత పాత్ర చాలా పవర్ఫుల్గా ఆలోచింపజేసీ విధంగా ఉంటుందని యూనిట్ పేర్కొంటోంది. గతంలో కూడా సమంత -యూ-టర్న్-, - ఓ బేబీ-, - యశోద- వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సత్తా చాటారు.
వాటిలో రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా సమంతకు సోలో మార్కెట సంపాదించి పెట్టాయి. ఆ ధైర్యంతోనే సామ్ పూర్తి పోకన్ ను మహిళా ప్రధాన చిత్రాల పైకి మళ్లించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా? సమాజంలో మహిళల స్థానాన్ని ప్రతిబింబించే పాత్రలను ఎంచుకోవడం సమంత తీసుకున్న సాహసోపేత నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల టాలీవుడ్ లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. అగ్ర కథానాయికలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు రచయితలు కూడా మహిళల దృక్కోణంలో బలమైన కథలను రాయడానికి ఉత్సాహం చూపిస్తారు.