ప్రముఖ నటి, కొణిదెల వారి కోడలు లావణ్యత్రిపాఠి తన కెరీర్ లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత 'సతీ లీలావతి' చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. కెరీర్ ఆరంభంలో ఓ తమిళ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ దాంతో ఆ సినిమానే వదులుకున్నానని, దీనిపై చిత్రబృందం తన మీద కేసు పెట్టిందన్నారు. అంతటితో ఆగకుండా మీడియాలోనూ తప్పుడు కథనాలు రాయించారని, ఆ ఘటనతో మానసికంగా తాను కుంగిపోయానని తెలిపింది. అలాగే, బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'గీత గోవిందం' చిత్రంలో హీరోయిన్గా తొలి అవకాశం తనకే వచ్చిందని, అయితే ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ఆఫర్ ను వదులుకోవాల్సి వచ్చిందని లావణ్య వెల్లడించారు. ఇక వరుణ్ తేజ్‌తో తన ప్రేమ, వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, “ఒక సినిమా వేడుకలో వరుణ్ కళ్లను చూసి ప్రేమలో పడ్డాను. ఆయన చాలా సపోర్టివ్ ఉ ంటారు. మా మధ్య గొడవ వస్తే తను వాదిస్తాడు, నేను మౌనంగా ఉ ండిపోతాను. వరుణ్ లాంటి భర్త దొరకడం, మెగా కుటుంబంలోకి రావడం నా అదృష్టం" అని లావణ్య త్రిపాఠి తెలిపారు.