పంజాబ్ కింగ్స్ పై 23 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ ఘనత అర్ధ సెంచరీలతో రాణించిన వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి పంజాబ్ తరపున శశాంక్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా ఫలితం శూన్యం బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన రసిఖ్ సలామ్ దార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ 23 వరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో, ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. తొలుత బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి అర్థ సెంచరీలతో చెలరేగగా, అనంతరం బౌలర్లు రాణించడంతో బెంగళూరు ఖాతాలో మరో గెలుపు చేరింది. శశాంక్ సింగ్ వీరోచిత పోరాటం చేసినా పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ప్రియాన్షి ఆర్య (0), ప్రభ్సమ్రాన్ సింగ్ (2) పెవిలియన్ చేరారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) కూడా విఫలమవడంతో పంజాబ్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కనోలీ (37), సూర్యాంక్ షెడ్గే (35), మార్కన్ స్టాయినిస్ (37) ఫర్వాలేదనిపించారు. అయితే, అసలు సంచలనం శశాంక్ సింగ్ రూపంలో వచ్చింది. కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన శశాంక్, ఒకానొక దశలో పంజాబ్‌కు విజయంపై ఆశలు రేపాడు. కానీ, కీలక సమయంలో రసిఖ్ నలామ్ దార్ అతన్ని ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరికి పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు వడగొట్టాడు. అంతకుముందు, టాస్ గెలిచిన వంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే జాకబ్ బెథెల్ (11) వికెట్ కోల్పోయినా, కెప్టెన్ విరాట్ కోహ్లి (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సులు), దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుతమైన భాగస్వామ్యంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వెంకటేశ్ అయ్యర్ అసలు సినలు విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28) కూడా మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.