ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వస్తోందా? గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఎట్టకేలకు తన పునరాగమనానికి సిద్ధమవుతున్నాడా?.. ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలు ఇచ్చాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగే అవకాశాలున్నాయని అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ప్రీ-సీజన్ ట్రైనింగ్ పిక్క గాయంతో బాధపడిన 44 ఏళ్ల ధోనీ ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ధోనీ వస్తాడని భావించినా, చివరి నిమిషంలో ఆయన చెన్నైలోనే ఉండిపోయాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓటమి పాలవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ మాట్లాడిన అశ్విన్.. ధోనీ పునరాగమనంపై ఆశలు రేకెత్తించాడు. “ఇప్పటికీ నాణ్యమైన పేస్ హిట్టర్ గురించి మాట్లాడితే అది ధోనీనే.
సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగే మ్యాచ్‌లో అతడు ఆడేందుకు మంచి అవకాశం ఉందని నాకనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం" అని అశ్విన్ పేర్కొన్నాడు. గడిచిన రెండు, మూడు మ్యాచ్‌ల నుంచే ధోనీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తాను విన్నట్లు కూడా ఆయన తెలిపాడు. ధోనీ గైర్హాజరీలో జట్టు మేనేజ్మెంట్పై వస్తున్న విమర్శలను అశ్విన్ తోసిపుచ్చాడు. "గాయాల విషయంలో కెప్టెన్ లేదా కోర్‌ను నిందించలేం. ఇది పూర్తిగా ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన విషయం" అని ఆయన వివరిం చారు. ధోనీ లేని లోటు చెన్నై బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపి స్తోంది. అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ వ్యవహరిస్తున్నప్పటికీ, డెత్ ఓవర్లలో ఫినిషర్‌గా ధోనీ అను భవం జట్టుకు ఎంతో అవసరం. లక్నోతో ఓటమితో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 12 పాయింట్లు, 0.027 నెట్ రన్ రేట్‌తో ఉంది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకో వాలంటే సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవడం చెన్నైకి తప్పనిసరి. ఈ నేపథ్యంలో, చెపాక్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో 'తలా' ధోనీ అడుగుపెడతాడో లేదో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.