ఐపీఎల్ లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్? నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ కు రాజకీయ పార్టీలకు చెందిన ఎలాంటి బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్'లు తీసుకురావద్దని సూచించింది. "మైదానానికి వచ్చి క్రికెట్, క్రీడాస్ఫూర్తిని ఆస్వాదించండి. మా సూపర్ ఫ్యాన్స్‌కు ప్రేమతో ఓ విజ్ఞప్తి. పార్టీలు, వ్యక్తులకు సంబంధించిన జెండాలు, హోర్డింగ్స్, బ్యానర్లు తీసుకురావొద్దు. పసుపు రంగుపై ప్రేమతో గేమ్‌ను ఎంజాయ్ చేయండి" అని సీఎస్?కే ఓ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలోనే ఈ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా లఖ్? నవూ సూపర్ జెయింట్స్‌తో చెన్నై జట్టు తలపడనుంది. విజయ్? నేతృత్వంలోని తమిళ వెట్రిగ కళగం పార్టీ అధికార గుర్తు విజిల్ కావడమే ఇందుకు కారణం. అటు సీఎస్? కే అభిమానులకు సైతం విజిల్?తో విడదీయరాని అనుబంధం ఉంది. కొన్నేళ్లుగా సీఎస్?కే 'విజిల్ పోడు' అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది. దీంతో సీఎస్?కే మ్యాచ్? జరిగిన ప్రతీ సారి అభిమానులు మైదానంలోకి విజిల్? తీసుకుని వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. కాగా, చెన్నైలోని స్టేడియంలోకి రాజకీయ చిహ్నాలను అనుమతించకపోవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ సమయంలో కూడా ఫ్యాన్స్‌న టీవీకే గుర్తు అయిన విజిల్‌ను అభిమానులు మైదానంలోకి తీసుకెళ్లకుండా అడ్డుకొన్నారు. అప్పట్లో స్టేడియం బయట కూడా విజిల్స్ విక్రయాలను పోలీసులు నిషేధించారు. ఇది అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేసింది. ఈ క్రమంలోనే స్పందించిన తమిళనాడు క్రికెట్ అసొసియేషన్ దీనిపై వివరణ ఇచ్చింది. తాము లేదా బీసీసీఐ, ఐసీసీ విజిల్‌పై ఎటువంటి ఆంక్షలు విధించలేదని వెల్లడించింది. ఇది కేవలం స్థానిక పోలీసు యంత్రాంగం విధించిన ఆంక్షలు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా, తమిళనాడు రాజధాని చెన్నై బిజీబిజీగా మారింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అభిమానుల కోలాహలం, విజిల్ శబ్దాల నడుమ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత 9 మంది టీవీకే నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ -6 ఈవెంట్‌కూ చెన్నైనే వేదిక కావడం గమనార్హం. దీంతో భద్రతకు సంబంధించి చెన్నై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని అప్పగిస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి సంజు శాంసన్ తెరదించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రచారానికి వ్యాఖ్యతలే ఆజ్యం పోశారు. మాజీ క్రికెటర్ ఆర్ ఆశ్విన్ కూడా సంజు కచ్చితంగా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించడంతో ఈ ప్రచారం ఊపందుకొంది. ఈ ఈ క్రమంలోనే తాజాగా సంజు ఓ ప్రోమో వీడియోలో అభినవ్ ముకుంద్ మాట్లాడుతూ ఈ ప్రచారానికి తెరదించాడు. తాను ఎటువంటి డిమాండ్లతో చెన్నై జట్టులో చేరలేదని క్లారిటీ ఇచ్చాడు. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఎలాంటి డిమాండ్లతో వెళ్లకూడదని నేర్చుకొన్నానని అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు కూడా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఓ వీడియోలో మాట్లాడుతూ చెన్నై జట్టు రుతురాజ్ కెప్టెన్సీ నుంచి చాలా నేర్చుకొంటుందని అన్నారు. అదే సమయంలో సంజుపై ఒత్తిడి ఉంచాలని తాను భావించడంలేదని అభిప్రాయపడ్డారు.