1,252 మంది ఆకస్మిక వరదల్లో మృతి ఇంకా దొరకని 4,800 మంది ఆచూకీ
నేపాల్ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య ఏకంగా 1,252కి చేరింది. వివత్తు జరిగి వారం రోజులు దాటినా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అదే సమయంలో ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీశారు. నేపాల్ పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాకోట్ జిల్లాలో 177 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రసువా జిల్లాలో 127, గోర్ఖాలో 69, ధాడింగ్‌లో 60, తహనులో 38 మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు గురువారం తొమ్మిదో రోజు కూడా తమ గాలింపు, సహాయక చర్యలను కొనసాగించాయి. దాదాపు 4,800 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో 11,993 మందిని రక్షించినట్లు తెలిపారు. వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గుర్తుపట్టలేనతంగా ఉన్న మృతదేహాలను ఐచీూ పరీక్షలకు పంపుతున్నారు. నిర్ధరించిన వాటిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. 1,113 మృతదేహాల పోస్టుమార్టం, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేశామని నేపాల్ పోలీసులు వెల్లడించారు. గుర్తుతెలియని 911 మృతదేహాల వెబ్సైట్లో ఉంచారు. గల్లంతైన తమవారు ఇక తిరిగిరారని భావించిన కుటుంబ సభ్యులు పశుపతి ఆర్యమాట్ వద్ద ప్రతీకాత్మక దహన సంస్కారాలు నిర్వహించారు. వరదల్లో కొట్టుకుపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ప్రార్ధనలు చేస్తున్నారు. మరోవైపు సువాకోట్లోని బిదూర్లో వరద వల్ల రోడ్లు కొట్టుకుపోగా నేపాల్ ఆర్మీ త్రిశూలీ నదిపై తాత్కాలికంగా జిప్టాన్ ఏర్పాటు చేసింది. జిప్టాన్ ద్వారా ప్రజల్ని నదికి ఒకవైపు నుంచి మరోవైపు తరలిస్తోంది. వివత్తు ప్రభావిత ప్రాంతాల్లో 21,314 మంది భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, భోటేకోశీ, త్రిశూలీ నదులపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వివిధ హైడ్రోపవర్ ప్రాజెక్టుల నుంచి 947 మంది కార్మికులు గల్లంతయ్యారు. ప్రాణాలతో ఉన్నవారిని రక్షించేందుకు అన్నివనరులు వాడుతున్నామని నేపాల్ హోంమంత్రి సుడాన్ గురుంగ్ తెలిపారు. దీనికితోడు సింధుపాల్చాక్ 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం సహా రసువా, సువాకోట్, ధాడింగ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు సవాల్ మారింది . నేపాల్ లో జరుగుతున్న సహాయక, పునరావాస చర్యలకు మద్దతుగా భారత్, చైనా సహా వలు దేశాలు పెద్ద ఎత్తున ఆహారం, మందులు, ఇతర సహాయక సామగ్రిని వంపిస్తున్నాయి. తాజాగా అమెరికా రెండో విడత మానవతా సామగ్రిని పంపించింది. ఈ మేరకు గురువారం రెండు అమెరికా సైనిక కార్గో విమానాలను వంపినట్లు భారత్'లో అమెరికా రాయబారి సెర్గియో గోర్? సోషల్ మీడియాలో వెల్లడించారు. నేపాల్ నేతృత్వంలోని గాలింపు, సహాయక, పునరుద్ధరణ చర్యలకు మద్దతుగా 5,000 ప్రత్యేక విపత్తు బాధితుల పునరుద్ధరణ సామాగ్రి, 500 ప్రథమ చికిత్స కిట్లు, స్ట్రెచర్లు, ఫ్రంట్-ఎండ్ లోడర్లను వంపించామని తెలిపారు. వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే ప్రకటించిన 3.6 మిలియన్ డాలర్ల అమెరికా సహాయాన్ని అందించామని గోర్ చెప్పారు. కాగా, భారత్ బుధవారమే మరో 5 టన్నుల ఔషధాలను నేపాల్‌కు పంపింది. దీంతో పాటు ప్రత్యేక పరికరాలను, 11 మంది నిపుణులను తీసుకొని ఐదో విమానం నేపాల్‌కు వెళ్లింది. ఇప్పటి దాకా 166 మంది భారతీయులను సహాయక సిబ్బంది రక్షించారు.