యువ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన లెటేస్ట్ మూవీ 'రోమాంచకం'. వేణు గోపాల్ రెడ్డి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే యూత్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ప్రీమియర్స్ తర్వాత సినిమాకు సంబంధించిన టాక్ బయటకు వస్తుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'రోమాంచకం'చూసిన అనంతరం మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. సినిమా చాలా ఎంటర్టైనింగ్, ప్రామిసింగ్ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా సహా మూవీ టీం మొత్తానికి మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ టీమ్ పెట్టిన ప్రేమ, ప్యాషన్, హార్డ్ వర్క్ స్పష్టంగా కనిపిస్తున్నాయని మహేశ్ ప్రశంసించారు. ఇంత కష్టపడి రూపొందించిన సినిమాకు తగిన ఫలితం తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఒక యంగ్ టీమ్ చేసిన ప్రయత్నాన్ని సూపర్ స్టార్ ఈ స్థాయిలో ప్రశంసించడం సినిమాకు మంచి బూస్ట్‌గా మారింది. మహేశ్ బాబు చేసిన ఈ పోస్టుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్పందించారు. తమ సినిమాను ప్రశంసిస్తూ, చిత్రబృందాన్ని ప్రోత్సహించినందుకు మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన ఈ సినిమా రొమాంటిక్, కామెడీ అంశాలతో తెరకెక్కింది. సుమంత్ ప్రభాస్‌కు 'మేమ్ ఫేమస్' తర్వాత ఇది మరో కీలక చిత్రం కాగా.. అసంతిక ఇప్పటికే తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించారు. ఇక సినిమాలో ఉపేంద్ర లిమయే, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై మొదటి నుంచీ ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాపై మహేష్ బాబు' ఎంటర్టైనింగ్ అండ్ ప్రామిసింగ్' అనే పాజిటివ్ కామెంట్ మూవీ మేకర్స్ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసించిన 'రోమాంచకం' థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, సుమంత్ ప్రభాస్-అనంతిక జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.