మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'లక్కీ భాస్కర్' . ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి మనీ లాండరింగ్, హవాలా ద్వారా ఎలా కోటీశ్వరుడిగా మారారు? తనను స్కామ్‌లో ఇరికించాలనుకున్న వారినే ఎలా ఇరికించి దేశం దాటేశారు? అనేదే ప్రధానాంశంగా సినిమా రూపొందించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లోనే సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. త్వరలోనే లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉ టుందని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వెంకీ అట్లూరి, 'చాలా మంది లక్కీభాస్కర్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. సీక్వెల్ మరింత పవర్ ఫుల్ స్టోరీతో రాబోతోంది.' అని చెప్పారు. దుల్కర్ సల్మాన్ సైతం లక్కీ భాస్కర్ సీక్వెల్ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు తాను ఏ మూవీ ఈవెంట్స్‌కు వటటళ్లినా లక్కీ భాస్కర్ సీక్వెల్ కోసం వెళ్లానని... ప్రతీ ఒక్కరికీ ఆ స్టోరీ బాగా కనెక్ట్ అయ్యిందని తెలిపారు. ఫస్ట్ పార్ట్ 100 కోట్ల స్కామ్‌కు పాల్పడిన వ్యక్తిగా హర్షద్ మెహతా రోల్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఫేక్ బీఆర్స్తో తో బ్యాంక్ నగదును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి భారీ కుంభకోణానికి పాల్పడిన తీరును చూపించారు. అయితే, ఆయన ఎవరు అనేది రివీల్ చేయలేదు. సీక్వెల్లో హర్షద్ మెహతా బ్యాగ్రౌండ్ తో పాటు సీబీఐ ఎంక్వైరీ, భారీ స్కామ్ నుంచి తప్పించుకున్న లక్కీ భాస్కర్ మళ్లీ ఇండియాకి తిరిగివచ్చాడా? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో సూపర్ హింట్ ఇస్తూనే సీక్వెల్ స్టోరీపైనా క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు, జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. సీక్వెల్లో మరిన్ని రోల్స్ యాడ్ కానున్నట్లు సమాచారం.