లఖ్ నవూ: సమష్టిగా చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానానికి ఎగబాకగా.. బ్యాటర్ల వైఫల్యంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఐపీఎల్లో బుధవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో లఖ్ నవూను చిత్తు చేసి.. రెండు వరుస ఓటముల తర్వాత గెలుపుబాట పట్టింది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్త్ 43 నాటౌట్), యశస్వీ జైస్వాల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 22), హెట్మయర్ (22) ఫర్వాలేదనిపించారు. షమి, ప్రిన్స్, మొహిసిన్ తలో 2వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లబ్నవూ 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (55) అర్థ శతకం వృథా అయింది. ఆర్చర్ 3.. ఐర్డర్, బ్రిజేశ్ చెరో 2 వికెట్లు తీశారు. జడేజా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. టపటపా..: మార్ష్ పోరాడినా.. రాజస్థాన్ బౌలర్లు దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకొన్న లఖ్‌నవూ మరో మ్యాచ్ లో ఓడింది. ఛేదనలో ఓపెనర్ ఆయుష్ బదోని (0)తోపాటు కెప్టెన్ రిషభ్ పంత్ (0), మార్క్రమ్ (0) డకౌట్ కావడంతో.. 11/3తో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో పూరన్ జతగా నాలుగో వికెట్‌కు 43 రన్స్ జోడించిన మార్ష్.. హిమ్మత్ సింగ్ (15)తో కలసి ఐదో వికెట్‌కు 37 రన్స్ జోడించి గెలుపుపై ఆశలు రేపాడు. కానీ, హాఫ్ సెంచరీ చేసిన మార్షన్ను బర్గర్ అవుట్ చేయగా.. ముకుల్ చౌదురి (7)తోపాటు షమి (6)ని బ్రిజేశ్ పెవిలియన్ చేర్చడంతో లఖ్‌నవూ ఓటమి ఖరారైంది. మయాంక్ (5), మొహిసిన్ (0)ను ఆర్చర్ వెనక్కి పంపాడు.
ఆదుకొన్న జడేజా:
పేసర్ షమి దెబ్బకు పవర్ ప్లేలోనే తడబడినా.. జడేజా ఆదుకోవడంతో రాజస్థాన్ పోరాడగలిగే స్కోరు చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ (8) తొలి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యంతో దూకుడైన ఆరంభాన్నే ఇచ్చారు. అయితే, 32 పరుగుల స్కోరు వద్ద వరుసగా టాప్-3 వికెట్లను చేజార్చుకొన్న రాయల్స్.. ఒక్కసారిగా కష్టాల్లో పడింది. మూడో ఓవర్లో జైస్వాల్, జురెల్ (0)ను షమి పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మొహిసిన్.. వైభవ్ వికెట్‌ను చేజిక్కించుకొన్నాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (20)ను ప్రిన్స్ వెనక్కిపంపగా.. దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్న హెట్మయర్ను మొహిసిన్ క్యాచవుట్ చేశాడు. ఈ దశలో జడేజా, ఫెరీరా (20) ఆరో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేయడంతో.. 15వ ఓవర్లో టీమ్ స్కోరు సెంచరీ మార్క్ దాటింది. ఫెరీరాను ప్రిన్స్ అవుట్ చేసినా.. ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే (19 నాటౌట్) తో కలసి జడేజా స్కోరు బోర్డును నడిపించాడు. మయాంక్ వేసిన ఆఖరి ఓవర్ లో జడ్డూ 4,4,6తో 20 పరుగులు పిండుకోవడంతో.. టీమ్ స్కోరు 160కి చేరువైంది.
స్కోరుబోర్డు:
రాజస్థాన్: జైస్వాల్ (సి) వంత్ (బి) షమి 22, వైభవ్ సూర్యవంశీ (సి) దిగ్వేజ్ (బి) మొహిసిన్ 8, జురెల్ (సి) పంత్ (బి) షమి 0, పరాగ్ (సి) పూరన్ (బి) ప్రిన్స్ 20, హెట్మయెర్ (సి) ప్రిన్స్ (బి) మొహిసిన్ 22, జడేజా (నాటౌట్) 43, ఫెరీరా (సి) మొహిసిన్ (బి) ప్రిన్స్ 20, శుభమ్ దూబే (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 159/6; వికెట్ల వతనం: 1-32, 2-32, 3-32, 4-62, 5-77, 6-110; బౌలింగ్: షమి 4-0-30-2, ప్రిన్స్ 4-0-29-2, మొహిసిన్ 4-1-17-2, మయాంక్ 4-0-56-0, దిగ్వేల్ రాఠి 4-0-26-0.
లబ్నవూ: మార్ష్ (సి) పరాగ్ (బి) బర్గర్ 55, బదోని (రనౌట్) 0, పంత్ (సి) జురెల్ (బి) బర్గర్ 0, మార్ క్రమ్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 0, పూరన్ (సి) ఫెరీరా (బి) జడేజా 22, హిమ్మత్ (బి) బిష్ణోయ్ 15, ముకుల్ (సి) వరాగ్ (బి) బ్రిజేశ్ 7, షమి (బి) బ్రిజేశ్ 6, మయాంక్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 5, దిగ్వేశ్ రాఠి (నాటౌట్) 2, మొహిసిన్ (బి) ఆర్చర్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18 ఓవర్లలో 119 ఆలౌట్; వికెట్ల పతనం: 1-9, 2-10, 3-11, 4-54, 5-91, 6-105, 7-111, 8-115, 9-119, 10-119; బౌలింగ్: ఆర్చర్ 4-1-20-3, బర్గర్ 4-0-27-2, బ్రిజేశ్ 3-0-18-2, జడేజా 4-0-29-1, రవి బిష్ణోయ్ 3-0-23-1.