ఐపీఎల్లో పాండ్య బ్రదర్స్ (కృనాల్- హార్దిక్) సందడి అంతా ఇంతా కాదు. ఈ సోదరులు ఇద్దరు తమ ప్రదర్శనతో ఈ లీగ్ లో ఉత్తమ ప్లేయర్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో ఈ ఇద్దరూ ముంబయి ఇండియన్స్క ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఒక్కరు ఒక్కో టీము ఆడుతున్నారు. అయితే ప్రత్యర్థులుగా బరిలోకి దిగినప్పటికీ పాండ్య బ్రదర్స్ స్పోర్ట్స్ స్పిరిట్ మెచ్చుకునేలా ఉంటుంది. మైదానం బయట కూడా వీళ్లద్దరూ ఇంకా ప్రేమగా ఉండేవారు. అయితే ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ఇటీవల ప్రచారం సాగుతోంది. మరోవైపు, కొంతకాలంగా ఈ ఇద్దరూ మునుపటిలా క్లోజ్‌గా కూడా ఉండడం లేదు. కొన్ని నెలలుగా ఒకే ఫ్రేమ్‌లో పాండ్య బ్రదర్స్ అసలు కనిపించింది లేదు. కనీసం సోషల్ మీడియాలోనైనా ఒకరినొకరు పలకరించుకున్నదీ లేదు. అయితే రీసెంట్గా ముంబయి ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కృనాల్ ఆర్సీబీకి, హార్దిక్ ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకుంటారేమో అని అభిమానులు ఎదురుచూశారు. కెమెరాలు కూడా వీళ్లిద్దర్నీ ఫోకస్ చేశాయి. కానీ మ్యాచ్ సందర్భంగా ఎదురుపడినప్పటికీ పాండ్య బ్రదర్ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. దీంతో అన్నదమ్ముళ్ల మధ్య విభేదాలు నిజమేనని అంతా అనుకుంటున్నారు! అయితే తమ సోదరుల మధ్య అంతా సవ్యంగా లేదన్న వార్తలపై కృనాల్ స్పష్టతనిచ్చాడు. తాజాగా అతడు ఆర్సీబీ ఇన్సైడర్స్ మిస్టర్ నాగ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో 'గతేడాది నువ్వు నా షోకు రాలేదు. అప్పుడు నేను ఫోన్ చేస్తే నువ్వు ఫ్యామిలో బిజీగా ఉన్నానని చెప్పావు. అంటే ఆర్సీబీ నీ ఫ్యామిలీ కాదా?' అని అడిగాడు. దీనికి కృనాల్ 'ఆర్సీబీ కూడా నా ఫ్యామిలీనే. నేను చెప్పాను కానీ నువ్వు సరిగ్గా విననట్లు ఉన్నావు. అయితే ఇంట్లో అనేకమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉ ంటారు. కానీ ఒక్కోసారి ఒకరిని మిస్ అవుతాము' అని అన్నాడు. దీనికి నాగ్స్ వెంటనే 'మీ సోదరుడి లాగానే' అని అన్నాడు. దీనికి కృనాల్ నవ్వేశాడు. ఈ క్రమంలోనే తమ బ్రదర్స్ మధ్య అంతా సవ్యంగానే ఉందా? అని కృనాల్న నాగ్స్ అడిగాడు."మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా? లేదా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా?” అని అడగ్గా, కృనాల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అప్పుడు హోస్ట్ "కేన్, అండర్టేకర్ కూడా కొన్నిసార్లు గొడవ పడతారు అది కామనే” (రెజ్లర్లను ఉ ద్దేశించి) అని వ్యాఖ్యానించాడు. దీనికి "అంతా బాగానే ఉంది" అని కృనాల్ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో అన్మదమ్ముళ్ల మధ్య గొడవలు అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.