ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే కోహ్లి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాజ్ బవా క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లికి ఇది 12 డకౌట్ కాగా.. 8వ గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్ అయిన జాబితాలో కోహ్లి మూడవ స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో రషీద్ ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉ న్నాడు. అతడు 12 సార్లు గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. అతడు 10 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రన్ మెషిన్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు కావడం ఇది రెండో సారి మాత్రమే. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ కోహ్లి రెండు బంతులకు డకౌట్ అయ్యాడు. అంతకముందు 2022 ఐపీఎల్ సీజన్లో లక్నో, సన్ రైజర్స్ పై వరుస మ్యాచ్‌ల్లో కోహ్లి డకౌట్లు అయ్యాడు.