అహ్మదాబాద్: స్వల్ప ఛేదనే అయినా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆఖరి ఓవర్లో గట్టెక్కింది. అటు తమ బ్యాటర్లు విఫలమైన చోట పంజాబ్ బౌలర్లు పోరాడినా. ఫలితం దక్కలేదు. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 57), వాషింగ్టన్ సుందర్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 నాటౌ ట్) కీలక ఇన్నింగ్స్ గుజరాత్‌ను ఆదుకున్నారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ 4 వికెట్లతో నెగ్గింది. పంజాబ్ కిది వరుసగా రెండో ఓటమి కాగా.. టైటాన్స హ్యాట్రిక్ గెలుపు. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. సూర్యాన్స్ షెడ్గే (29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57), స్థాయినిస్ (31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' హోల్టర్కు 4.. రబాడ, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్ 19.5 ఓవర్లలో 167/6 స్కోరు చేసి గెలిచింది. అర్హదీప్, వైశాక్లకు రెండేసి వికెట్లు లభించాయి. కెప్టెన్ గిల్ (5) విఫలమైనా.. సుదర్శన్, బట్లర్ (26) రెండో వికెట్‌కు 53 రన్స్ జోడించారు. అయితే ఆఖర్లో పంజాబ్ పట్టు బిగించడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. 6 బంతుల్లో 11 పరుగులు కావాల్సిన వేళ ఐదో బంతిని సుందర్ సిక్సర్‌గా మలచి మ్యాచ్‌ను ముగించాడు.
ఆదుకున్న సూర్యాన్స్-స్టోయినిస్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఈ సీజన్లో తొలిసారి తడబడింది. పేసర్లు హోల్డర్, రబాడ, సిరాజ్ ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వేళ.. నూర్యాన్స్, స్టోయినిస్ అద్భుతంగా ఆదుకున్నారు. దీంతో జట్టు కాస్త సవాల్ విసిరే స్కోరు చేయగలిగింది. ముందుగా భీకర ఫామ్‌లో లో ఉన్న ఓపెనర్ ప్రియాన్షా (2), కూపర్ (0)లను సిరాజ్ తొలి ఓవర్లోనే వెనక్కిపంపాడు. కెప్టెన్ శ్రేయాస్ (19), ఓపెనర్ ప్రభ్సమ్రన్ (15) కొద్దిసేపు క్రీజులో నిలిచి మూడో వికెట్‌కు 33 రన్స్ జోడించారు. అటు పరుగులు రావడం కూడా కష్టంగా మారగా.. 47/5 స్కోరుతో వంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యాన్స్ ఎదురుదాడికి దిగాడు. అతడికి స్థాయినిస్ సహకరించడంతో స్కోరుబోర్డులో కదలిక వచ్చింది. 14వ ఓవర్లో సూర్యాñ 6,6, 4, 4, 6తో 27 రన్స్ రాబట్టగా జట్టు స్కోరు వంద దాటింది. దీంతో అతను 24 బంతుల్లోనే తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 16వ ఓవర్లో సూర్యాక్షను రబాడ అవుట్ చేయడంతో ఆరో వికెట్‌కు 79 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక 18వ ఓవర్లో లో స్టాయినిస్, బార్టెట్ (0)లను వరుస బంతుల్లో హోల్డర్ పెవిలియన్ కు చేర్చి ప్రత్యర్థి పరుగుల వేగానికి బ్రేక్ వేశాడు. ఆఖరి ఓవర్లో యాన్సెన్ (20) 6,4తో 14 పరుగులు రాగా, జట్టు స్కోరు కూడా 160 దాటింది.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్షి (సి) నిషాంత్ (బి) సిరాజ్ 2, ప్రభ్‌సిమ్రన్ (సి) సుతార్ (బి) రబాడ 15, కూపర్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 0, శ్రేయాస్ (బి) హోల్డర్ 19, వధేరా (సి) బట్లర్ (బి) హోల్డర్ 0, సూర్యాన్స్ (సి) బట్లర్ (బి) రబాడ 57, స్థాయినిస్ (సి) వాషింగ్టన్ (బి) హోల్టర్ 40, యాన్సెన్ (సి) గిల్ (బి) రషీద్ 20, బార్ట్లెట్ (బి) హోల్డర్ 0, వైశాక్ (నాటౌట్) 1, అర్హదీప్ (నాటౌ ట్) 1, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 163/9; వికెట్ల పతనం: 1-2, 2-2, 3-35, 4-36, 5-47, 6-126, 7-141, 8-141, 9-162; బౌలింగ్: సిరాజ్ 4-0-28-2, రబాడ 4-1-22-2, హోల్డర్ 4-0-24-4, అర్షద్ 3-0-29-0, రషీద్ 4-0-32-1, మానవ్ సుతార్ 1-0-27-0.
గుజరాత్: సాయి సుదర్శన్ (సి) బార్ట్లెట్ (బి) వైశాక్ 57, గిల్ (సి) కూపర్ (బి) అర్హదీప్ 5, బట్లర్ (సి) శ్రేయాస్ (బి) వైశాక్ 26, నిషాంత్ (సి) వైశాక్ (బి) స్టాయినిస్ 15, వాషింగ్టన్ (నాటౌట్) 40, తెవాటియా (సి) బట్లర్ (బి) యాన్సెన్ 2, హోల్డర్ (సి) కూపర్ (బి) అర్ష్‌దీప్ 5, అర్షద్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19.5 ఓవర్లలో 167/6; వికెట్ల పతనం: 1-16, 2-69, 3-94, 4-124, 5-140, 6-152; బౌలింగ్: బార్ట్ట్ 4-0-38-0, అర్షిప్ 4-0-24-2, యాన్సెన్ 4-0-33-1, వైశాక్ 4-0-31-2, స్టోయినిస్ 2.5-0-26-1, చాహల్ 1-0-13-0.