ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త అందింది. ఈసారి ఆర్సీబీ హోంగ్రౌండ్ బెంగళూరు నుంచి షిఫ్ట్ కానుందని కొన్నిరోజులుగా వర్తలు వస్తున్నాయి. గతేడాది తొక్కిసలాట ఘటన వల్ల చిన్నస్వామిలో ఇప్పుడప్పుడే మ్యాచ్'లు జరగవు అని ప్రచారం సాగింది. అయితే ఆర్సీబీ మేనేజ్ మెంట్ తాజా అప్డేట్" తో ఈ ప్రచారానికి తెరదించింది. ఈసారి ఆర్సీబీ జట్టు తమ హోం మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 'నమస్కారం బెంగళూరు! మేం వచ్చేస్తున్నాం. బెంగళూరు ఫ్యాన్స్? రెడీగా ఉండండి. మిమ్మల్ని మళ్లీ అలరించేందుకు మన ఛాంపియన్లు చిన్నస్వామి స్టేడియానికి వచ్చేస్తున్నారు' అని ఆర్సీబీ పోస్టులో పేర్కొంది. అలాగే చిన్నస్వామిలో మ్యాచ్లన్ను నిర్వహించడంలో మార్గదర్శకత్వం, నహకారం, మద్దతు అందించినందుకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక పోలీసులకు మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలిపింది. ఐపీఎల్ సీజన్ కోసం సకాలంలో మౌలిక సదు-పాయాలు, భద్రతా చర్యలను మెరుగుపరచడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈఓ రాజేష్ మేనన్ మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం అనేది మాకు హోం గ్రౌండ్"గానే కాదు అంతకంటే ఎక్కువ. ఇది ఒక జట్టుగా మాకు గుర్తింపు ఇచ్చింది. ప్రతీ మ్యాచ్'లో మా కోసం మా అభిమానులు కొత్త ఎనర్జీని స్టేడియానికి తీసుకొస్తారు. అది మా ఆటగాళ్లకు ప్రేరణనిస్తుంది. మా అభిమానులు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు. అందుకే తమ అభిమాన జట్టు హోంగ్రౌండ్"లో పోటీ పడడాన్ని చూసేందుకు అర్హులు 'నిరంతర చర్చలు, అనుమతి పొందిన తర్వాత, బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు ఆడుతుందని ప్రకటించిస్తున్నందుకు మేం సంతోషంగా ఉన్నాం. ఇక్కడ మళ్లీ మ్యాచ్?లు నిర్వహణ సాధ్యం చేయడంలో మద్దతు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక పోలీసులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము' అని రాజేష్ మేనన్ అన్నారు. అయితే, మొత్తం ఏడు హోం గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు రాయ్‌పూర్ వేదికగా ఆడనుంది. కానీ, ఈ రెండు మ్యాచ్‌లను రాయుడ్కు ఎందుకు షిఫ్ట్ చేశారో తెలియాల్సి ఉంది. అలాగే ఏయే జట్టుతో ఆర్సీబీ చిన్నస్వామిలో ఆడనుందో అనే దానిపై షెడ్యూల్ రిలీజ్ అయ్యాకే క్లారిటీ వస్తుంది. కాగా, గతేడాది ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచిన క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజీ సంబరాలు నిర్వహించింది. ఈ ఈవెంట్?కు అనుకున్నదాని కంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో స్టేడియం గేటువద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, వదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో చిన్నస్వామి స్టేడియం భారీ ఈవెంట్లకు, క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు భద్రతాపరంగా సురక్షితం కాదని, అక్కడ మ్యాచ్‌లు ఆడించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ క్రమంలోనే గతేడాది మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో చిన్నస్వామిలో జరగాల్సిన మ్యాచ్‌లను నవీముంబయికి షిఫ్ట్ చేశారు. అలాగే దేశవాళీల్లోనూ ఆయా టోర్నీల్లో అక్కడ మ్యాచ్'లు జరగలేదు. దీంతో 2026 ఐపీఎల్'లోనూ అక్కడ మ్యాచ్'లు జరగడం అసాధ్యమే అని ప్రచారం సాగింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయిు-చేతే అనేక చర్చల తర్వాత ఇటీవల చిన్నస్వామి స్టేడియానికి క్లియరెన్స్ వచ్చింది. అందుకే అక్కడ మ్యాచ్'లు నిర్వహించేందుకు ఫ్రాంచైజీ రెడీ అవుతోంది. ఇక ఈ సీజన్"లో ఆర్సీబీ తమ సొంత అభిమానుల మధ్య బరిలోకి దిగనుంది. ఈ సీజన్ ఇదే నెలలో ప్రారంభం కానుంది. మార్చి 28న టోర్నీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ ప్రకటన వస్తుంది.