అర్థవంతమైన మార్గంలో సాగితేనే మంచిది జెన్ జీలకు మోడీ పరోక్ష హెచ్చరికలు
ప్రధాని నరేంద్ర మోదీ జెన్ జీ యువతకు కీలక సూచన చేశారు. షార్ట్‌కట్ కోసం వెంవర్లాడితే నష్టపోయే ప్రమాదమే ఎక్కువని ప్రధాని హెచ్చరించారు. జీవితంలో ముందుకుసాగే క్రమంలో అర్థవంతమైన మార్గాలను ఎంచుకోవాలని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు వ్యక్తులు వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఫుట్ బ్రిడ్జ్‌లను వాడకుండా రైల్వే ట్రాక్‌లను దాటుతుంటారని మోదీ గుర్తుచేశారు. అలాంటి వారికోసమే రైల్వే స్టేషన్లలో బోర్డులపై ప్రదర్శించే హెచ్చరికలు జీవిత పాఠాలను నేర్పుతాయన్నారు. మన ఆలోచనలపై ప్రభావం చూపించే ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ముందుకు వెళ్లే మార్గం కావాలనుకుంటే.. మీరు ఆరాధించే వ్యక్తులు ఆత్మకథ చదవండని సూచించారు. ఇటీవల కాలంలో మోదీ జెన్సీ యువతతో కనెక్ట్ అయ్యేలా తన సోషల్ మీడియా యాక్టివిటీలో మార్పులు చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియోలను పోస్టు చేస్తున్నారు. యువత వాడే భాషను ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో రీల్స్‌కే పరిమితం కాకుండా కెరీర్‌పైనా దృష్టిపెట్టాలని సూచించారు.