కదం తొక్కిన విద్యార్థులు,
నిరుద్యోగ యువత టీచర్ నియామక పరీక్షల ప్రక్రియపై నిరసన
సీఎం నివాసం ముట్టడి'కి యత్నం జలఫిరంగుల ప్రయోగం,
లాఠీచార్జి పోలీసుల పైకి రాళ్లు రువ్విన నిరసనకారులు
విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనతో బిహార్ రాజధాని పట్నా దద్దరిల్లింది. విహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు వ్యతిరేకంగా యువత కదం తొక్కింది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఉ ద్యమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో కాకుండా ఒకే దఫాలో పరీక్ష నిర్వహించా లని, నెగెటివ్ మార్కుల్ని తీసివేయాలని, ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషన్ నిర్వ హించిన కంబైన్డ్ కాంపిటీటివ్ పరీక్షల్లో జరిగిన అవక తవకల దృష్ట్యా ఆ పరీక్షలను రద్దు చేయాలని పేర్కొ న్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ. అక్రమాలపై కొన్ని వారాలుగా నిరనన తెలుపుతున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సీఎం. నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పట్నాలోని గాంధీ మైదాన్ నుంచి ర్వాలీ ప్రారంభమైంది. వారిని అడ్డుకోపటానికి పోలీసులు.. సీఎం నివాసం వరకూ 5 కి.మీ.ల మేర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ, యువత ముందుకు కదలటంతో వాటర్ కెనాన్లను ప్రయోగిం చారు. కానీ, గత నెలలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లోలాగే ఈసారి కూడా ఆందోళనకారులు వాటర్ కెనాన్లకు బెదరకుండా ఆ నీళ్లలో తదుస్తూ రెయిన్ డ్యాన్సులు చేశారు. వారు అలాగే ముందుకు సాగటంతో డాక్బంగ్లాచౌక్ వద్ద పోలీసులు లాఠీచార్జి జరిపారు. దీంతో నిరనసకారులు పోలీసుల మీద రాళ్లు విసి రారు. ఈ ఘర్షణలో అందోళనకారులతో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కొన్ని గంటలపాటు పట్నా రణరం గంగా మారింది. పలువురు ఆందోళనకారుల్ని పోలీసులు అడు పులోకి తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు.
వివాదాస్పదమైన చైర్మన్ వ్యాఖ్యలు
విద్యార్థుల నిరసనకు ముందురోజైన సోమవారం బీపీఎస్ సీ చైర్మన్ రాకేశ కుమార్‌సింగ్, 'రోడ్డు మీద ఏనుగు పోతుంటే వెయ్యి కుక్కలు మొరుగుతాయి' అంటూ చేసిన వ్యాఖ్య కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. కొందరు విద్యార్థులు, ఉద్యోగార్థులు గత కొన్ని వారాలుగాపాట్నాలో చేస్తున్న ధర్నాను ఉద్దే శించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై యువత భగ్గు మంది. తమను వీధికుక్కలతో పోల్చటం ఏమిటని పలువురు యువతీ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ పర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ వ్యాఖ్య లను బండించారు. దీనిపై రాకేశ్కుమార్సింగ్ విచారం వ్యక్తం 'చేసినప్పటికీ.. నిరనన ఆగలేదు. 32,888 ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం ఈ నెల 18వ తేదీన బీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, గతంలో లేని ప్రిలిమ్స్, మెయిన్స్ తరహా పరీక్ష విధానం, నెగెటివ్ మార్కులపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.