పలు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ విశాఖలో లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ 51 వేల కోట్లతో సత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ కడపలో 12 వేల కోట్లతో అదానీ ఇంధన ప్రాజెక్టు తిరుపతిలో 2,500 కోట్లతో ఎన్ఫీల్డ్ యూనిట్ అనుమతుల వేగంలో ఏపీ బ్రాండ్ కనబడాలి ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చాలి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం.
అమరావతి : రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా చెందేశాలు ఆధ్యక్షతమంత్రి సచివాలయంలో బుధవారం జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో పలు కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమెరికా వెలుపల గూగుల్ ఇంత భారీ పెట్టుబడి పెట్టడాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే.. గూగుల్‌ను మించి విశాఖలో రిలయన్స్ సంస్థ రూ. 1,08,010 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను కూడా రిలయన్స్ స్థాపిస్తుంది. ఈ పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అలాగే కడపలో రూ. 12,287 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ వంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు, తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు పలు పెట్టుబడులకు ఎస్ఐపీబీ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రానికి రూ. 2,01,023 కోట్ల పెట్టుబడులు వస్తాయి. వీటితో 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ప్రతి ఒప్పందమూ గ్రౌండ్ కావాలి: సీఎం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సిందేనని, ప్రతి ఒప్పందమూ గ్రౌండ్ కావాల్సిందేనని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఒక పారిశ్రామిక ప్రతిపాదన రాష్ట్రానికి వచ్చాక అనుమతుల నుంచి పరిశ్రమ స్థావన దాకా నిర్దిష్ట కాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా ఆలస్యం జరిగేందుకు వీల్లేదన్నారు. అనుమతుల మంజూరులో 'ఏపీ బ్రాండ్' స్పష్టంగా కనిపించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే మన రాష్ట్రం విభిన్నంగానూ, వేగంగానూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉ ందని చెప్పారు. పెట్టుబడులను ఆమోదించడంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ఎంత భిన్నంగా వ్యవహరిస్తుందో ప్రాక్టికల్‌గా నిరూపించాలంటూ కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావాలన్న తపన ఉన్న అధికారులను నియమించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.