తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో 1980, 1990వ దశకాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ నళిని, ఇప్పుడు భక్తి మార్గంలో చేసిన విభిన్న ఆచరణతో వార్తల్లో నిలిచారు. తాను భక్తి కోసం భిక్షాటన చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జూలై 18న (శుక్రవారం) తమిళనాడులోని తిరువేర్కడులో ఉన్న కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట నళిని కొంగుపట్టి భక్తుల దగ్గర భిక్షాటన చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు, సినీ ప్రేమికులు షాక్‌కి గురయ్యారు. అయితే నళిని చేసిన ఈ పని వెనుక ఆర్థిక కారణం లేదని, అది భక్తి సంకల్పం అని ఆమె స్పష్టంచేశారు.
“అమ్మవారు కలలోకి వచ్చారు…”
మీడియాతో మాట్లాడిన నళిని, “అమ్మవారు నా కలలోకి వచ్చి – ‘నా కోసం నువ్వేం చేస్తావ్?’ అని అడిగింది. ఆ క్షణం నాకు ఏం చేయాలో తోచలేదు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. భిక్షగా వచ్చిన డబ్బులను అమ్మవారికే సమర్పించాను,” అని చెప్పారు.
చలనచిత్రాల నుంచి సీరియల్స్ వరకూ – నళిని ప్రయాణం
నళిని 1981లో వచ్చిన రణువ వీరన్ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. చిరంజీవి, రజనీకాంత్ వంటి పెద్ద స్టార్లతో కలిసి పనిచేశారు. ఆమె "ఇంటిగుట్టు", "వీడే", "సీతయ్య", "పున్నమినాగు", "నువ్వేకుండటే నేనక్కడుంటా", "ఒక్క అమ్మాయి తప్ప" వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
1988లో నళిని నటుడు రామరాజన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అరుణ్, అరుణ అనే కవలలు పుట్టారు. కానీ వివాహబంధం పదేళ్లకే ముగిసింది. ప్రస్తుతం నళిని పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ భిక్షాటన ఘటన ద్వారా నళిని మరొక్కసారి ప్రజల దృష్టిలోకి వచ్చారు. సినిమా తెరపై కాకపోయినా, భక్తి పథంలో ఆమె చూపిన ఈ భిన్న దృక్పథం సామాజికంగా ప్రశంసల పత్రికలలోకి ఎక్కుతోంది.
View this post on Instagram
A post shared by Madrasmixture தமிழ் (@madrasmixturetamil)