టీ20 వరల్డ్ కప్ మధ్యలోనే పొట్టి ఫార్మాట్లో ఆటగాళ్ల ర్యాంకింగ్‌లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. వరల్డ్ కప్ లో దారుణంగా విఫలమైన అభిషేక్ శర్మ.. టీ20 నెంబర్ వన్ ర్యాంక్‌ను మాత్రం నిలబెట్టుకున్నాడు. బౌ లింగ్లో వరుణ్ చక్రవర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలు సాధించిన పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను సాధించాడు. ఏకంగా 848 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానానికి చేరుకున్నాడు. అభిషేక్ శర్మ ఖాతాలో 874 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒకస్థానం దిగజారి మూడోస్థానంలో ఉన్నాడు. 783 రేటింగ్ పాయింట్లతో ఇషాన్ కిషన్ నాల్గో స్థానంలో, 749 రేటింగ్ పాయింట్లతో ఆరవ స్థానంలో తిలక్ వర్మ ఆరోస్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ ఒక స్థానం ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. ఈ ప్రపంచ కప్‌లో 292 పరుగులు చేసిన తర్వాత జింబాబ్వే బ్యాట్స్‌మెన్ బ్రియాన్ బెన్నెట్ ఆరు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ర్యాన్ రికెల్టన్ 13వ స్థానానికి, ఐడెన్ మార్క్రామ్ 16వ స్థానానికి చేరుకున్నారు. సూపర్-8లో విండీస్‌పై అద్భుతంగా ఆడిన సంజు శాంసన్.. 25 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కూడా బ్యాట్స్‌మెన్ జాబితాలో కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ 43వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ప్రపంచకప్‌లో వరుణ్ చక్రవర్తి 12 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ రెండోస్థానంలో ఉ ండగా.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 3వ స్థానానికి ఎగబాకాడు. ఆదిల్ రషీద్, కార్బిన్ బాష్ ఒక్కోస్థానం కోల్పోయి 4వ, 5వ స్థానాల్లో ఉన్నారు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకోగా.. అర్ష్ప్ సింగ్ ఆరు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ లియామ్ డాసన్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి ఆరు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 328 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి చేరుకోగా.. సైమ్ అయూబ్ మూడోస్థానానికి పడిపోయాడు. జాసన్ హోల్డర్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. వరల్డ్ కప్ ముగిసేలోపు ఈ ర్యాంక్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.