నేడు వాంఖడే మైదానం వేదికగా సెమీ ఫైనల్ 2 ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే సెమీఫైన్-2లో ఇంగ్లండ్ భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి. వెస్టిండీస్ తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన భారత్.. అదే జోరు కనబర్చి ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలనుకుంటుంది. తద్వారా టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. బలబలాల పరంగా ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో ఈ మ్యాచ్పి సర్వత్రా ఆసక్తి నెలకొంది. లీగ్ దశను భారత్ అజేయంగా ముగిస్తే.. సూపర్-8ను ఇంగ్లండ్ అజేయంగా ముగించి సెమీస్ కు అర్హత సాధించింది. పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. బ్యాటింగ్ పాటు ఫీల్డింగ్ లోనూ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. విండీస్ మ్యాచ్‌లో రెండు సునాయన క్యాచ్‌లను వదిలేసాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ 80 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడంలో అభిషేక్ శర్మ తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టి రింకూ సింగ్‌ను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ టీవ్-ఎమేనేజ్మెంట్ ఆ సాహనం చేయకపోవచ్చు. ఎలాంటి మార్పులు లేకుండా గత కాంబినేషన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ గత మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా తడబడ్డాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో వరుణ్ చక్రవర్తీని తప్పించి కుల్దీవ్ యాదవ్‌ను ఆడిస్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇంగ్లండ్‌పై వరుణ్ చక్రవర్తికి మెరుగైన రికార్డ్ ఉంది. కాబట్టి అతన్ని కొనసాగించే అవకాశాలు ఉ న్నాయి. అయితే వాంఖడే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉ ంటుంది. అలా అని కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ తగ్గనుంది. కాబట్టి మరోసారి కుల్దీప్ యాదవ్‌కు నిరాశే ఎదురవ్వనుంది. టీ20ల్లో ఎక్స్ట్రా బ్యాటర్‌తో ఆడితే ప్రయోజనం ఉంటుందని టీమిండియా మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతుంది. వ్యూహాత్మకంగా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే పరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్‌లో ఒకరు బెంచ్‌కు వరిమితమవుతారు. బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి మార్పులు జరిగే ఛాన్స్ లేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఆడనున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజూను తిరిగి ఆడించగా.. అతను కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
అభిషేక్ శర్మ కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఇషాన్ కిషన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ మిడిల్, లోయార్డర్ లో ఆడనున్నారు. రింకూ సింగ్ బెంచ్క పరిమితం కానున్నాడు. సూర్య ఒత్తిడిని పక్కనపెట్టి స్వేచ్చగా ఆడాల్సిన అవసరం ఉంది. జస్క్రీప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. హార్దిక్ అతనికి అండగా నిలవనున్నాడు. శివమ్ దూబేతో బౌ లింగ్ వేయించలేని పరిస్థితి నెలకొంది. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఎవరా? అనేది టీమిండియాకు సవాల్‌గా మారింది. సిరాజ్‌కు మరోసారి మొండి చెయ్యే ఎదురు కానుంది.
ఇంగ్లండ్ సెమీఫైనల్లో తలపడే భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్ప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా.