పవిత్రమైన ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో భక్తుల స్పందనతో ముగిసింది. సుమారు 1.8 లక్షల దర్శన టోకన్ల కోసం ఏకంగా 24 లక్షలకు పైగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
భక్తుల అసాధారణ స్పందన:
ఈ-డిప్ రిజిస్ట్రేషన్లు 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి 02వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. మొత్తం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
-
అత్యధికంగా 13.4 లక్షల మంది భక్తులు టీటీడీ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు.
-
టీటీడీ వెబ్ సైట్ ద్వారా 9.3 లక్షల మంది, ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు.
దర్శన టోకన్ల కేటాయింపు:
డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1వ తేదీ... ఈ మూడు రోజులకు గాను ఆన్లైన్లో ఈ-డిప్ (ఎలక్ట్రానిక్ డిప్) విధానం ద్వారా భక్తులకు దర్శన టోకన్లను కేటాయించనున్నారు. ఈ-డిప్ లో ఎంపికైన భక్తులకు ఈరోజు ఆన్లైన్లో టోకన్లను కేటాయిస్తారు.
వైకుంఠ ద్వార దర్శనం: సామాన్య భక్తులకు పెద్దపీట
మొత్తం పది రోజుల పాటు (డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా సీఎం సూచనల మేరకు విస్తృత చర్యలు తీసుకుంటూ టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల వివరాలు (డిసెంబర్ 30 – జనవరి 8)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు ఉన్న 10 రోజుల దర్శన వివరాలు ఇవీ..
| దర్శన తేదీలు |
దర్శన వివరాలు |
టోకెన్ల సంఖ్య |
ఆన్లైన్ విడుదల తేదీ |
| డిసెంబర్ 30, 31 & జనవరి 1 |
ఈ-డిప్ ద్వారా కేటాయింపు (రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్లు) |
దాదాపు 1.8 లక్షలు |
ఈ-డిప్ ద్వారా కేటాయింపు |
| జనవరి 2 నుండి జనవరి 8 వరకు (మొదటి 7 రోజులు) |
సర్వదర్శనం యథాతథం |
- |
- |
| జనవరి 2 నుండి జనవరి 8 వరకు (చివరి 7 రోజులు) |
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు |
రోజుకు 15,000 |
డిసెంబర్ 5వ తేదీ |
| జనవరి 2 నుండి జనవరి 8 వరకు (చివరి 7 రోజులు) |
శ్రీవాణి టిక్కెట్లు |
రోజుకు 1,000 |
డిసెంబర్ 5వ తేదీ |
| జనవరి 6, 7, 8 (చివరి 3 రోజులు) |
స్థానికుల కోసం టోకన్లు |
రోజుకు 5,000 |
డిసెంబర్ 10వ తేదీ |