కీలక పోరులో వెస్టిండీతో భారత్ విజయం
బ్యాటింగ్‌లో చెలరేగిన శాంసన్
5న ఇంగ్లండ్ సెమీస్
కోల్‌కతా: టీ20 వరల్డ్క్వలో భారత జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం వెస్టిండ్నతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ శతకం ముంగిట నిలిచాడు. ఇక ఈ విజయంతో గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు సెమనలో ఇంగ్లండ్ తలపడనుంది. గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. అటు విండీస్ ఈ ఓటమితో ఇంటిముఖం పట్టగా.. 2016 సెమీస్ లో కరీబియన్ల చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. చేజ్ (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ 40), హోల్డర్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్), పోవెల్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్), హోప్ (33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్త్ 32), హెట్మయెర్ (12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 27) రాణించారు. బుమ్రాకు 2 వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలిచింది. తిలక్ (27) ఫర్వాలేదనిపించాడు. హోల్డర్, జోసటఫలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. ఛేదనలో ఓపెనర్ శాంసన్ ఆరంభం నుంచి ముగింపు వరకు అంతా తానై కదం తొక్కాడు. మరో ఎండ్‌లో పెద్దగా సహకారం లభించకపోయినా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా జట్టును సెమీసు చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా నిలకడను ప్రదర్శిస్తూ చెలరేగాడు. ఇక జింబాబ్వేపై హాఫ్ సెంచరీతో ఫామ్ చాటుకున్న అభిషేక్ (10) మళ్లీ నిరాశపరిచాడు. ఇషాన్ (10) ఆట ఆరు బంతులకే పరిమితమైంది. వాస్తవానికి తొలి 10 బంతుల వరకు శాంసను బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ మూడో ఓవర్లో మాత్రం 4,6,4తో తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. తన జోరుతో పవర్‌ప్లేలో స్కోరు 53/2తో మెరుగ్గా కనిపించింది. సూర్య (18) ఆచితూచి ఆడినా మరోవైపు శాంసన్ మాత్రం ధాటిని కొనసాగించాడు. షెఫర్డ్ ఓవర్లో 6,4తో ఆకట్టుకున్నాడు. అటు ఓసారి క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్న సూర్యను 11వ ఓవర్లో జోసెఫ్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. అయితే 13వ ఓవర్లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లతో 17 రన్స్ సమకూరాయి. హెట్మయెర్ సూపర్ క్యాచ్ తను పెవిలియన్‌కు చేరినా నాలుగో వికెట్‌కు 26 బంతుల్లోనే 42 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హార్దిక్ (17), దూబే (8 నాటౌట్) సహకరించారు. మరోవైపు శాంసన్ శతకం పూర్తి చేయకపోయినా 6,4తో మ్యాచ్‌కు అద్భుత ముగింపునిచ్చాడు.
హోల్డర్-పోవెల్ ఎదురుదాడి
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆరంభం ఓ మాదిరిగా సాగగా, మధ్య ఓవర్లలోనూ పెద్దగా మెరుపులు కనిపించలేదు. కానీ చివరి ఐదు ఓవర్లలో హోల్డర్, పోవెల్ బ్యాట్లకు పనిచెప్పారు. దీంతో విండీస్ స్కోరు 200 దరిదాపుల్లోకి రాగలిగింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు హోప్, చేజ్ 68 పరుగులు జోడించినా.. బంతికో పరుగు చొప్పున అన్నట్టుగా వీరి ఆట సాగింది. ముఖ్యంగా షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడిన హోప్ 17 డాట్ బాల్స్ ఆడాడు. మరోవైపు చేజ్ మూడో ఓవర్లో రనౌట్, ఐదో ఓవర్లో క్యాచ్ అవుట్ నుంచి బతికిపోయాడు. పవర్‌ప్లేలో 45 వరుగులతో నిలిచిన విండీస్ తొమ్మిదో ఓవర్లో తొలి వికెట్‌ను కోల్పోయింది. హోప్‌ను వరుణ్ బౌల్డ్ చేయడంతో ఈడెన్ లో హుషారు కనిపించింది. ఆ తర్వాత హెట్మయెర్ ఉన్నది కాసేపైనా ధనాధన్ ఆట ఆడాడు. వరుణ్ ఓవర్లో 6,4తో 17 రన్స్ రాబట్టాడు. అయితే 12వ ఓవర్లో పేసర్ బుమ్రా డబుల్ ఝలక్ ఇచ్చాడు. జోరు మీదున్న హెట్మయెర్తో పాటు క్రీజులో నిలదొక్కుకున్న చేజ్‌ను సైతం పెవిలియన్‌కు చేరాడు. కాసేపటికే రూథర్ ఫోర్డ్ (14)ను హార్దిక్ దెబ్బతీయడంతో విండసెకు 150 కూడా కష్టమేనేమో అనిపించింది. ఈ స్థితిలో ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ అండగా నిలవగా, అతడికి పోవెల్ సహకరించాడు. 16వ ఓవర్ లో పోవెల్ 6,6,4 బాదగా మొత్తం 24 రన్స్ సమకూరాయి. ఆ తర్వాత హోల్టర్ 6,4తో 14 రన్స్ రాగా, స్కోరు 150 దాటింది. కానీ 19వ ఓవర్లో అర్షదీప్ 6 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. దీంతో ఆఖరి ఓవర్లో 14 రన్స్ వచ్చినా స్కోరు 200 లోపే ముగిసింది. ఐదో వికెట్‌కు హోల్డర్-పోవెల్ జోడీ అజేయంగా 76 రన్స్ జత చేసింది.
స్కోరుబోర్డు
వెస్టిండీస్: హోప్ (బి) వరుణ్ 32, చేజ్ (సి) సూర్య (బి) బుమ్రా 40, హెట్మయెర్ (సి) శాంసన్ (బి) బుమ్రా 27, రూథర్‌ఫోర్డ్ (సి) శాంసన్ (బి) హార్దిక్ 14, పోవెల్ (నాటౌట్) 34, హోల్డర్ (నాటౌ ట్) 37; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 195/4; వికెట్ల పతనం: 1-68, 2-102, 3- 103, 4-119; బౌలింగ్: అర్షదీప్ 4-0-43-0, హార్దిక్ 4-0-40-1, అక్షర్ 4-0-35-0, బుమ్రా 4-0-36-2, వరుణ్ 4-0-40-1.
భారత్: అభిషేక్ (సి) హెట్మయెర్ (బి) హెుసీన్ 10, శాంసన్
(నాటౌట్) 97, ఇషాన్ (సి) హెట్మయెర్ (బి) హోల్డర్ 10, సూర్య (సి) రూ థర్ఫోర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్మయెర్ (బి) హోల్డర్ 27, హార్దిక్ (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17, దూబే (నాటౌ ట్) 8, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 19.2 ఓవర్లలో 199/5. వికెట్ల పతనం: 1-29, 2-41, 3-99, 4-141, 5-179. బౌలింగ్: హెుసీన్ 2-0-22-1, ఫోర్డ్ 3-0-22-0, హోల్డర్ 4-0-38-2, మోటీ 2-0-18-0, షెఫర్డ్ 2.2-0-34-0, జోసెఫ్ 4-0-42-2, చేజ్ 2-0-18-0.