సినీ నటులు ఇన్ఫ్లూయెన్సర్ కల్చర్‌ను సమర్థించాలని ప్రముఖ నటి తమన్నా భాటియా సంచలన వ్యాఖ్యలు చేశారు. నటనతో పాటు కంటెంట్ క్రియేషన్‌లోనూ నటులు రాణించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కొత్త ట్రెండ్ గురించి తమన్నా ఇంకా ఏం చెప్పారంటే..
సినీ రంగంలో కొత్త సవాళ్లను స్వీకరిస్తూ నటులు ఇన్ఫ్లూయెన్సర్లుగా మారుతున్నారని తమన్నా భాటియా అన్నారు. నటనతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కంటెంట్ క్రియేషన్‌లో రాణించాలని ఆమె సూచించారు. "నటన నా గుండెల్లో ఉంది, కానీ ఇన్ఫ్లూయెన్సర్గా మారడం కాలానుగుణంగా జరుగుతుంది" అని తమన్నా చెప్పారు. సోషల్ మీడియా ద్వారా బ్రాండ్లను ప్రమోట్ చేయడం, అభిమానులతో సన్నిహితంగా ఉండటం నటులకు కొత్త అవకాశాలను అందిస్తోందని ఆమె వెల్లడించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇన్ఫ్లూయెన్సర్ల హాజరు గురించి మాట్లాడుతూ, తమన్నా ఈ ట్రెండ్‌ను స్వాగతించారు. "పోటీ భావన లేదు, అందరికి తమ గొంతును వినిపించే అవకాశం ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు తెరలేపాయి.