చుక్కపాలు సేకరించని సంస్థలకు నెయ్యి టెండర్లు
కల్తీ నెయ్యి.. వ్యవస్థీకృత సిండికేట్ నేరమే
రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారీ
జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీడీబీ నివేదిక
దాని ఆధారంగానే నేను, పవన్ మాట్లాడాం
2022లోనే కల్తీ వెలుగులోకి
వైఎస్ నాటి నుంచే తిరుమలలో అపచారాలు
శ్రీవారికి ఉన్నది రెండు కొండలేనంటూ 2005 సెప్టెంబరు 16న జీవో 338 జారీ
నాడు నేను రద్దుచేయాలన్నది 338నే
కానీ జగన్ అబద్ధాలు చెబుతున్నారు
ఆయన హయాంలో ప్రణాళిక ప్రకారమే ఆలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం
పాపాలు దాచేందుకే హెరిటేజ్ పై దుష్ప్రచారం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం
అమరావతి: వైకాపా హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లము చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 'మహాపాపం' పేరిట వైకాపా హయాంలో లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయన వివరించారు. రాజకీయ వివాదం ఉండకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపించింది. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించాం. లడ్డూ వ్యవహారంలో కాకుండా అనేక విషయాల్లో తప్పులు చేశారు. 2019-24 మధ్య 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారు. రూ.231.51 కోట్ల అక్రమాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారు. ఒక పద్దతి ప్రకారం లాలూచీ పడిన లూటీ అని స్పష్టంగా తేలింది. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా రిపోర్టును తొక్కిపెట్టారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని నేను సొంతంగా ఏమీ చెప్పలేదు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టునే చెప్పా. ఆ భగవంతుడే నాతో చెప్పించాడని చంద్రబాబు అన్నారు. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే తనపైనే దాడికి దిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రక్షాళన కోసం ఈవోను నియమించామని చెప్పారు. తన దృష్టికి వచ్చిన నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ రిపోర్ట్ వివరాలు వెల్లడించానని తెలిపారు. శ్రీవారి లడ్డూ విషయంలోనే కాదు.. అనేక విషయాల్లో తప్పు చేశారంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 59.71 లక్షల కేజీల రసాయనాలతో కూడిన నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారని వివరించారు. తద్వారా రూ.234.51 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ అగ్రనేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాబ్‌ల కళ్లు గప్పి నెయ్యి టెండర్లు దక్కించుకున్నారని విమర్శించారు. 2019 24 మధ్య రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని పేర్కొన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. 2026 జనవరి 23న ఈ కల్తీ లడ్డూ వ్యవహారంలో సీబీఐ చార్జ్ట్ వేసిందని గుర్తు చేశారు. అలిపిరి ఘటనలో శ్రీవేంకటేశ్వర స్వామి వారే తన ప్రాణాలను కాపాడారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కల్తీ నెయ్యి వినియోగం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సిట్ వేయాలని ఆలోచించినట్లు ఏపీ సీఎం తెలిపారు. సిట్ ఏర్పాటును వైసీపీ నేతలు సుప్రీంకోర్టులో నవాల్ చేశారని గుర్తు చేశారు. రాజకీయ వివాదం ఉండొద్దనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో సిట్ ఏర్పాటు చేశామని వివరించారు. సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించిందన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపిందని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినందుకే ఏకసభ్య కమిటీ అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీబీఐ రిపోర్టుతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. 2020 జనవరి, ఫిబ్రవరిలో టెండర్ల నిబంధనలు మార్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాణ్యతా ప్రమాణాలకు సైతం వారు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారన్నారు. 2022 ఆగస్టులో బీటా సిటోస్టిరాల్‌తో రసాయనాలు కలిశాయని నివేదిక వచ్చిందని చెప్పారు. అఈఖీఎ ల్యాబ్ రిపోర్ట్ వస్తే.. దానిని సైతం తొక్కిపెట్టారన్నారు. 2024 జులై 23న రిపోర్ట్ వచ్చిందని.. అందులోని అంశాలనే భగవంతుడు తనతో చెప్పించాడని సీఎం చంద్రబాబు తెలిపారు.
జంతు కొవ్వు కలిసిందని తాను సొంతంగా చెప్పలేదని స్పష్టం చేశారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను సైతం తొలగించారన్నారు. 2019 ఆగస్టులో టెండర్ నిబంధనల్లో సడలింపు చేశారని చెప్పారు. టర్నోవర్, పాల సేకరణ సామర్థ్యాన్ని కూడా తగ్గించారని పేర్కొన్నారు. 2020 జనవరిలో శ్రీ వైష్ణవి ప్లాంట్‌ను తనిఖీ చేసి.. ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారన్నారు. కేజీకి రూ.329 చొప్పున భోలేబాబాకు నెయ్యి సరఫరా ఆర్డర్ ఇచ్చారని పేర్కొన్నారు. 2022 జూన్‌లో ఫతేపూర్‌లోని భోలేబాబా ఎ÷-లాం ఎ+-లాంట్ తనిఖీ చేసి.. డబ్బులు ఇవ్వలేదని ఆ సంస్థపై అనర్హత వేటు వేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒక పథకం ప్రకారం తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు కుట్ర చేశారంటూ వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తిరుమలకు ఏ మతస్థులైనా రావొచ్చునని.. అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నామని నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని చెప్పారు. టెండర్ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. నాటి టీటీడీ బోర్డు చైర్మన్ పీఏ చిన్నఅప్పన్న లంచం తీసుకుని దొరికిపోయారని చెప్పారు. ఇవన్నీ నాటి టీటీడీ చైర్మన్, బోర్డుకు తెలిసే జరిగాయని తెలిపారు. నాడు లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందని చాలా ఆరోపణలు వచ్చాయని గర్తు చేశారు. కల్తీ నెయ్యి తయారీకి ముఠాగా ఏర్పడ్డారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నాటి టీటీడీ చైర్మన్ పీఏ చిన్నప్పన్న రూ.4.5 కోట్ల లంచం తీసుకున్నారన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో టెండర్లు దక్కించుకుని రసాయనాల నెయ్యి సరఫరా చేశారని తెలిపారు. కల్తీ నెయ్యి తయారీకి వివిధ రకాల రసాయనాలు వినియోగించినట్టు దర్యాప్తులో తేలిందని సీఎం చంద్రబాబు వివరించారు.