ఫిబ్రవరి 24 : ఐపీఎల్లో ప్రతిసారి గట్టి పోటీనిచ్చే లక్నో సూపర్ జెయింట్స్ వచ్చే సీజన్ కు పక్కాగా సిద్ధమవుతోంది. ఇప్పటికే కోచింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకున్న లక్నో. ఇకపై కొత్త లోగోతో మైదానంలోకి దిగనుంది. లావెండర్ రంగులో లక్నో పట్టణం చరిత్రను ప్రతిబింబించేలా గరుగ్మంతుడు, కిరీటం, ఏనుగు బొమ్మతో రూపొందించిన లోగో ప్రత్యేక ఆకర్షణగా మారింది. లక్నో ఫ్రాంచైజీ కొత్త లోగో ఉత్తరప్రదేశ్.. లక్నో పట్టణ విశిష్టతను, స్పూర్తిగాథను చాటేలా సరికొత్తగా.. అభిమానులకు అమితంగా నచ్చేలా రూపొందించారు. తాజా లోగోలో శక్తివంతమైన గరుడు, కిరీటం, ఏనుగు బొమ్మలు ఉ న్నాయి. గరుడ (గరుత్మంతుడు) చిహ్నం ధైర్యానికి ప్రతీక. నవాళ్లను స్వీకరించడం.. వెనక్కి తిరిగి చూడకపోవడం, ఉన్నత శిఖరాలకు చేరడాన్ని సూచిస్తుంది. లక్నో జట్టు అనుసరించే భయమన్నది ఎరుగని క్రికెట్‌ను, సమిష్టిగా ఆడితే అసాధ్యమైన లక్ష్యమంటూ ఉండదని చాటుతుంది. కిరీటం విషయానికొస్తే దర్పం, బాధ్యతకు ప్రతీక. మైదానంలోకి దిగిన ప్రతిసారి లక్షలాదిమంది ఆశల్ని లక్నో జట్టు మోస్తుంది. లక్నో జెర్సీ ధరించడం ఎంతో గర్వకారణం. ప్రతిరోజు ఈ గౌరవాన్ని పొందాలని కిరీటం సూచిస్తుంది. కొత్త లోగుకు ఏనుగు బొమ్మ గుండెతో సమానం. బలం, తెలివి, ఓపిక, ఐక్యత.. ఈ లక్షణాలకు ప్రతిరూపమే ఏనుగు. ఫలితంతో సంబంధం లేకుండా సీజన్ సీజన్‌కు అభిమానుల నుంచి లభిస్తున్న నిరంతర మద్దతు, వారు చూపించే కృతజ్ఞతా భావానికి బొమ్మ ప్రతీక. క్లుప్తంగా చెప్పాలంటే లక్నో వీధులకు సబంధించిన లోగో ఇది. ఇంట్లో ఉండి క్రికెట్ మ్యాచ్‌లు చూసే కుటుంబాలు, ఏదో ఒకరోజు లక్నో జెర్సీ వేనుకోవాలని ఆశపడే యువతకు ఇది ప్రతిబింబిం. కొత్త లోగో.. ఈ ప్రాంత చరిత్ర, గౌరవం, ఐకత్య సందేశాన్ని చాటుతుంది. ర్పేఎస్సీ గ్రూప్ చైర్మన్, లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా తమ కొత్త లోగోపై ఏమన్నారంటే.. 'ఈ కొత్త లోగో మా ఫ్రాంచైజీ భావోద్వేగానికి సంబంధించినది. మొదటి రోజు నుంచి ఉత్రరప్రదేశ్, లక్నో ప్రజలు లక్నో సూపర్ జెయింట్స్ కు తమ హృదయాల్లో స్థానమిచ్చారు. అభిమానుల నమ్మకం, ప్రేమకు కృతజ్ఞతగా ఈ సింబల్‌ను రూపొందించాం. ఉన్నత స్థానానికి చేరాలనే మా కలకు గరుడ ప్రతీక. మైదానంలోకి దిగిన ప్రతిసారి గర్వపడే ప్రదర్శన చేయాలని కిరీటం సూచిస్తుంది. లక్నో ప్రాంత వైవిధ్యం, ద్రుఢత్వానికి ఏనుగు సంకేతం. ఈ లోగోను మార్పుకోసమే తీసుకురాలేదు. ఇదొక ప్రామిస్. లక్నో సిటీని, ఇక్కడి మూలాలను మేము ఎంతగా గౌరవిస్తామో ఈ లోగో చెప్పకనే చెబుతుంది. ప్రతి పరుగు, వికెట్, మైదానంలోని ప్రతి క్షణం.. అభిమానుల ఎమోషన్స్‌ను చూపిస్తాయి. ఈ కొత్త లోగో ఇకపై లక్నో జట్టు జెర్సీపై, డిజిటల్ ఎ+-లాట్ఫామ్స్ లోనూ కిట్లపై, కనిపించనుంది. మా ఫ్రాంచైజీ అధికారిక ప్రచార సంస్థలు.. కొత్త లోగోతో కొనసాగుతాయి' అని సంజీవో వెల్లడించారు.