సౌత్ వెస్టర్న్ రైల్వేలో 904 అప్రెంటీస్ పోస్టులు – దరఖాస్తుకు ఆగస్టు 13 చివరి తేది!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ వెస్టర్న్ రైల్వే (SWR), హుబ్బళ్లి, బెంగళూరు, మైసూరు రైల్వే డివిజన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 904 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ భర్తీని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నిర్వహిస్తుంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు 2025 ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
- 2025 ఆగస్టు 13 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు వివరాలు:
- దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మాఫీ ఉంది.
- రాత పరీక్ష లేకుండా, విద్యార్హతలలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వారికి స్టైపెండ్, అలాగే ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పించనున్నారు. ఇది మంచి అవకాశం కావడంతో, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఇంకా పూర్తి వివరాలకు, దరఖాస్తు లింక్‌కు సంబంధించి దశలవారీగా సమాచారం రైల్వే అధికారిక వెబ్సైట్లో ఉంది. లింక్ కింద ఉంది చెక్ చేయండి.
సౌత్ వెస్టర్న్ రైల్వేలో 904 అప్రెంటీస్ పోస్టులు